గత కొంతకాలంగా సెలబ్రిటీల జాతకాలు చెబుతూ సోషల్ మీడియాలో సెలబ్రిటీగా మారిపోయారు ప్రముఖ ఆస్ట్రాలజర్, సెలబ్రిటీ జోతిష్యుడు వేణుస్వామి. అయితే ఆయన సెలబ్రిటీల మీద చేసే వ్యాఖ్యలను చాలా మంది కొట్టిపారేస్తుంటారు. కానీ కొంత కాలానికి అవే నిజాలుగా మారుతుంటాయాని వేణుస్వామి చెప్పుకొచ్చాడు. రామ్ చరణ్-ఉపాసన, నాగచైతన్య-సమంత, విజయ్ దేవరకొండ లాంటి మరికొంత మంది సెలబ్రిటీల విషయంలో నేను చెప్పిన విషయాలు అక్షరాల జరిగాయని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పుకొచ్చారు. ఈ ఇంటర్వ్యూలో రెబల్ స్టార్ ప్రభాస్ 2023లో దారుణ పరిస్థితులు ఎదుర్కొంటాడు అని అన్నారు. మరికొన్ని ఇబ్బందులు సైతం అతడు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే..
వేణుస్వామి.. సెలబ్రిటీ జోతిష్యుడిగా టాలీవుడ్ లో పేరు సంపాదించుకున్నారు. పరిశ్రమలో ఉన్న పలువురి జాతకాలు చెప్పి ముందే చెప్పి ఆశ్చర్యానికి గురిచేశారు. అయినప్పటికీ తన జోతిష్యాన్ని చాలా మంది నమ్మరు అని వేణుస్వామి చెప్పుకొచ్చారు. తాజాగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో 2023లో ప్రభాస్ ఎదుర్కొబోయే ఇబ్బందుల గురించి సంచలన విషయాలను వెల్లడించారు. ప్రభాస్ ఆరోగ్యం వచ్చే ఏడాది ఎలా ఉండబోతోంది అని యాంకర్ ప్రశ్నించగా.. దానికి సమాధానం ఇస్తు..”సాధారణంగా నేను సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ గురించి చెప్పను. కానీ జాతకాల రీత్యా వారి లైఫ్ ఎలా ఎఫెక్ట్ అవ్వబోతోందో మాత్రం చెప్తాను. గతంలో నేను సెలబ్రిటీల విషయంలో చెప్పిన విషయాలు అన్నీ జరిగాయి. ఇప్పుడు కూడా ప్రభాస్ విషయంలో జరుగుతాయి. ప్రభాస్ జీవితంలో చాలా అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. అలాగే మూవీల పరంగా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు. అయితే ప్రభాస్ జాతకాలను నమ్మరు వచ్చిన ఇబ్బంది అల్లా అదే” అని చెప్పుకొచ్చారు వేణుస్వామి.
ఇక ప్రభాస్ ది వృశ్చిక రాశి అని ఆయనకు అర్థాష్టమ శని, ఒకవైపు అష్టమ గురువు, మరోవైపు షష్ఠమ గురువులు ఉండటంతో రాబోయే ఏడాది ప్రభాస్ అనేక సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందని వేణుస్వామి చెప్పుకొచ్చారు. ఏదైనా నమ్మకంతోనే చెయ్యాలని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం వేణుస్వామి చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. అయితే గతంలో వేణుస్వామి రామ్ చరణ్-ఉపాసన దంపతులకు సంతానం లేటుగా అందుతుందని చెప్పారు. అది తాజాగా నిజం అయింది, ఇక నాగచైతన్య-సమంతల విషయంలో కూడా వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు నిజమైయ్యాయని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పుకొచ్చారు. నేను చెప్పినప్పుడు ఎవరు నా మాటలు నమ్మరని, అవి నిజాలుగా తేలిన తర్వాతే వారు నమ్ముతారని ఈ సందర్బంగా ఆయన పేర్కొన్నారు. గతంలో కూడా ప్రభాస్ పెళ్లిపై సంచలన కామెంట్స్ చేశారు వేణుస్వామి. ప్రస్తుతం ప్రభాస్ వరుసగా సలార్, ప్రాజెక్ట్ కె, ఆదిపురుష్ లాంటి భారీ పాన్ ఇండియా మూవీలు చేస్తూ బిజీగా ఉన్నాడు.