వెంకటేష్ ఓటీటీలో సిరీస్ చేయడం ఏమోగానీ సోషల్ మీడియా షేక్ అవుతోంది. బూతు సిరీస్ లో వెంకీ నటించాల్సిన అవసరం ఏముందా అని ప్రతి ఒక్కరూ తెగ మాట్లాడుకుంటున్నారు. మరి దీనికి రీజన్ ఏంటో మీకు తెలుసా?
విక్టరీ వెంకటేష్ పేరు చెప్పగానే ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీస్, నో కాంట్రవర్సీస్ మాత్రమే గుర్తొచ్చేవి. ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ రిలీజ్ తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది. వెంకీమామ ఇమేజే పూర్తిగా ఛేంజ్ అయిపోయింది. ఈహీరోని చూసి ఒక్కొక్కరు షాక్ ల మీద షాక్ తింటున్నారు. వెంకటేష్ నోటి నుంచి బూతులు, 18+ డైలాగ్స్, అలాంటి సైగలు చూసి ప్రేక్షకుల ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. చాలామంది అనడానికే ఆలోచించే కొన్ని పదాల్ని ఈ సిరీస్ లో వెంకీమామ సింపుల్ గా అలా అనేసుకుంటూ పోయాడు. మరి వెంకీ మామలో ఈ రేంజ్ మార్పు రావడానికి కారణమేంటి? అసలు అడల్ట్ హీరో తరహా రోల్ చేయడానికి రీజన్ ఏంటో తెలుసా?
అసలు విషయానికొచ్చేస్తే.. నటుడు అనేవాడికి దాహం ఎక్కువ. కెరీర్ లో పాజిటివ్ రోల్స్ మాత్రమే కాదు. ప్రేక్షకులు అసహ్యించుకునే నెగిటివ్ పాత్రలు కూడా చేయాలని అనుకుంటాడు. ఒకే మూసలో ఇరుక్కుపోకుండా ఏదైనా కొత్తగా ప్రయత్నించాలని తాపత్రయపడుతూ ఉంటాడు. ఇది ఓన్లీ హీరోల విషయంలోనే కాదు చాలామంది హీరోయిన్లకు వర్తిస్తుంది. ఇక పాన్ ఇండియా కల్చర్ బాగా పెరిగిపోయిన తర్వాత వెబ్ సిరీసులు చూడటం అందరికీ చాలా అంటే చాలా అలవాటైపోయింది. దీంతో ఇన్నాళ్లు సినిమాలకే పరిమితమైన యాక్టర్స్ లో చాలామంది ఓటీటీల్లో అడుగుపెడుతున్నారు. అలా విక్టరీ వెంకటేష్ కూడా తాజాగా ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల్ని పలకరించాడు. వెంకటేష్ ఉన్నాడు కదా అని పొరపాటున కూడా ఈ సిరీస్ ని ఫ్యామిలీతో కలిసి చూడొద్దు. ఒకవేళ చూశారా? మీ పని అయిపోవడం గ్యారంటీ.
ఈ సిరీస్ లో G* అనే వర్డ్ ని వెంకటేష్ చాలాసార్లు ఉపయోగించాడు. శృంగారం గురించి కూడా అదే పనిగా వెంకటేష్ పోషించిన నాగ నాయుడు పాత్ర మాట్లాడుతూ ఉంటుంది. అయితే వెంకీ లాంటి ఫ్యామిలీ ఇమేజ్ ఉన్న హీరో ఇలా చేయడానికి మొదటి రీజన్ పాన్ ఇండియా గుర్తింపు. బూతులు ఉన్నాయని చాలామంది తిట్టుకుంటారు కానీ ఎవరూ లేని టైంలో వాళ్లే ఆ సిరీస్ లని చూస్తారు. అదే టైంలో వెంకటేష్ ‘సైంధవ్’ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులోనూ ‘రానా నాయుడు’లో పాత్రకు ఉన్నట్లే యాటిట్యూడ్ చాలా ఉంటుందట. అలా ఆ మూవీ కోసం రిహార్సల్స్ అవుతుందని కూడా వెంకీ మామ ఈ సిరీస్ చేసినట్లు తెలుస్తోంది.
ఇవన్నీ పక్కనబెడితే.. వెంకటేష్ పై ఫ్యామిలీ ఇమేజ్ అనే ముద్ర ఉంది. దాన్ని బ్రేక్ చేయాలంటే ఎప్పుడో ఓసారి కొత్తగా, ఇంకా చెప్పాలంటే బోల్డ్ గా ప్రయత్నించక తప్పుదు. ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ తో వెంకీమామ అదే చేసినట్లు కనిపిస్తుంది. ఇప్పుడు బూతులు జనాలకు కాస్త అలవాటు అయిపోయాయి కాబట్టి.. తర్వాత తర్వాత ఇలాంటి వెబ్ సిరీస్ లు చేసినా సరే జనాలు పెద్దగా పట్టించుకోరు. అప్పుడు వెంకీలో నటుడిని మాత్రమే చూస్తారు తప్పితే.. ఏంటి అలా చేశాడు? ఏంటి ఇలా అనేశాడు? అని అస్సలు మాట్లాడుకోరు. మరోవైపు తెలుగు వాళ్లకంటే వెంకటేష్ ఇమేజ్ ఇది అని తెలుసు. మిగతా భాషల వాళ్లకు అవేం తెలియదు కాబట్టి… స్టార్టింగ్ స్టార్టింగే వెంకటేష్ బాగా నచ్చేస్తాడు. అతడి నుంచి ఇలాంటి సిరీస్ లని ఇంకా ఎక్స్ పెక్ట్ చేస్తారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే వెంకీమామ ఈ ప్రయోగం చేసినట్లు తెలుస్తోంది. మీలో ఎంతమంది ‘రానా నాయుడు’ సిరీస్ చూశారు? అందులో వెంకీ క్యారెక్టర్, డైలాగ్స్ ఎలా అనిపించాయి? కింద కామెంట్ చేయండి.