సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహాన్ని జూబ్లీహిల్స్ లోని ఫిలిం ఛాంబర్ వద్ద అభిమానుల కడచూపు కోసం ఉంచారు. ఆయన భౌతికకాయానికి పెద్ద ఎత్తున ప్రముఖులు, అభిమానులు నివాళి అర్పిస్తున్నారు. సిరివెన్నెల పార్థీవదేహాన్ని పలువురు కన్నీటి పర్యంతం అయ్యారు. ఆయన పార్థివ దేహాన్ని సందర్శించిన హీరో విక్టరీ వెంకటేశ్ భావోద్వేగానికి గురయ్యారు. తెలుగు ఇండస్ట్రీ గొప్ప రచయితను కోల్పోయింది కన్నీరు పెట్టుకున్నారు.
బొబ్బిలి రాజా, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే నుంచి మొన్నటి నారప్ప వరకు ఆయన ఎన్నో అద్భుతమైన పాటలు అందించారు. ఆయనతో నాకు ఎంతో ఎంతో అనుబంధం ఉండేదని.. కానీ ఇప్పుడు ఆయన లేరు అన్న మాట జీర్ణించుకోలేపోతున్నా అని కన్నీటి పర్యంతం అయ్యారు. సిరివెన్నల ఆత్మకు శాంతి చేకూరాలని.. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.