యువ దర్శకుడు వెంకటేశ్ మహాను వివాదాలు వీడట్లేదు. ‘కేజీఎఫ్’ మూవీలో హీరో పాత్రను ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ కాంట్రవర్సీగా మారిన సంగతి విదితమే. ఇది గడవక ముందే మరో విషయంలో ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చాడీ డైరెక్టర్.
టాలీవుడ్ యువ దర్శకుడు వెంకటేశ్ మహా గురించి తెలిసిందే. సెన్సిబుల్ సినిమాలు తీసే డైరెక్టర్‌గా ఆయనకు మంచి పేరుంది. తొలి సినిమా ‘కంచరపాలెం’తో తానేంటో నిరూపించుకున్నాడు వెంకటేశ్. ఆ తర్వాత సత్యదేశ్ హీరోగా తీసిన ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’తో మరోసారి ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాడు. సెన్సిబుల్ స్టోరీస్‌కు విలేజ్ నెటివిటీ అద్ది ఆయన ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంటాడు. అలాంటి వెంకటేశ్ మహా ఇటీవల ఓ వివాదంలో చిక్కుకున్నాడు. కొంతమంది తెలుగు దర్శకులతో కలసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ‘కేజీఎఫ్’ మూవీపై చేసిన కామెంట్స్ కాంట్రవర్సీగా మారాయి. నీచ్ కమీన్ కుత్తే అంటూ ఆయన అసభ్య పదజాలంతో మాట్లాడిన వీడియోలు నెట్టింట పెద్ద దుమారపే రేపాయి.
వెంకటేశ్ మహా వ్యాఖ్యలతో హర్ట్ అయిన యశ్ ఫ్యాన్స్ ఆయన్ను టార్గెట్‌గా చేసుకుని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో వెంకటేశ్ మహా స్పందించాడు. తాను అలా మాట్లాడి ఉండాల్సింది కాదని.. వాడిన పదజాలం సరికాదన్నాడు. కాగా, ఇప్పుడు మరో విషయానికి సంబంధించి ఆయన ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. తాను నటించిన ‘యాంగర్ టేల్స్’ అనే వెబ్ సిరీస్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో వెంటకటేశ్ మహా మాట్లాడాడు. తాను ఇందులో ‘రంగా’ అనే పాత్రలో యాక్ట్ చేశానన్నాడు. తన క్యారెక్టర్ ఎలా ఉండబోతోందో ట్విట్టర్ పోస్టులో చెబుతూ పేరెంట్స్‌కు ఓ సూచన చేశాడు. రంగా పాత్రకు కథానుసారంగా 18 ఏళ్ల లోపు వయసు వారికి తగని భాష వాడారని ఆయన ట్వీట్ చేశాడు. ‘ఈ ఎపిసోడ్ చూసేటపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా పేరెంట్స్‌ను కోరుతున్నా. కానీ మిగిలిన 3 ఎపిసోడ్లు ‘రాధ, గిరి, పూజ’లను కుటుంబ సమేతంగా చూసి ఆనందించొచ్చు’ అని ఆ ట్వీట్లో వెంకటేశ్ మహా పేర్కొన్నాడు.
#AngerTalesOnHotstar
March 9th onwards@tilakprabhala @ActorSuhas @RavindraVijay1 @thebindumadhavi @phanindracharya @TharunBhasckerD @SridharBobbala @MadonnaSebast14 @amardeepguttula @VinodBangari2 @Kalyankodati @smaransai pic.twitter.com/lS5E9QFgOU— Venkatesh Maha (@mahaisnotanoun) March 8, 2023