నందమూరి నటసింహం బాలకృష్ణ ‘అఖండ’ సినిమా తర్వాత నటించిన చిత్రం వీర సింహారెడ్డి. స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది వీర సింహారెడ్డి. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది ఈ సినిమా. విడుదలైన తొలి రోజు నుంచే థియేటర్ల వద్ద మాస్ టాక్ తో దూసుకెళ్లింది. వీర సింహారెడ్డిలో బాలయ్య వన్ మ్యాన్ షో కి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దాంతో ఈ బాలయ్య రూ. 100 కోట్ల క్లబ్ లో చేరారు. అయితే ఈ సినిమాను థియేటర్లలో చూడటం మిస్ అయిన వారు ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని ఎదురుచూస్తుంటారు. అలాంటి వారికి శుభవార్త చెప్పింది ప్రముఖ ఓటీటీ సంస్థ. త్వరలోనే ఓటీటీలో వీర సింహారెడ్డి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపింది.
వీర సింహారెడ్డి.. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఫుల్ లెంగ్త్ మాస్ యాక్షన్ మూవీ. డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. ప్రేక్షకులు బాలయ్య నుంచి ఏం కోరుకుంటారు ఆ అంశాలను చూపించాడు. ఇక ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా శ్రుతిహాసన్ నటించగా.. హనీరోజ్, వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర, దునియా విజయ్ లు కీలక పాత్రల్లో నటించారు. సంక్రాంతి కానుకగా బరిలోకి దిగిన వీర సింహారెడ్డి కలెక్షన్లలో దూసుకెళ్లింది. బాలయ్య మాస్ డైలాగ్స్, ఫైటింగ్ లకు థియేటర్లు దద్దరిల్లిపోయాయి. ఇక ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో తన నట విశ్వరూపాన్ని చూపారు బాలయ్య. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులు బాలయ్య యాక్టింగ్ కు ఫిదా అయ్యారు.
ఈ క్రమంలోనే ఈ సినిమా ఇప్పటి వరకు బాక్సాఫీస్ వద్ద దాదాపుగా రూ. 130 కోట్లు కలెక్ట్ చేసినట్లు సమాచారం. దాంతో వీర సింహారెడ్డిని థియేటర్లో మిస్ అయిన వారు ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. అలాంటి వారికి శుభవార్త చెప్పింది ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్. వీర సింహారెడ్డి ఓటీటీ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ దక్కించుకున్నట్లుగా సమాచారం. ఓటీటీ హక్కుల కోసం హాట్ స్టార్ భారీగానే డబ్బులు చెల్లించినట్లు తెలుస్తోంది.
ఇక ఈ వీర సింహారెడ్డి ఫిబ్రవరి 21 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే గతంలో కూడా అఖండ ఓటీటీ రైట్స్ ను డిస్నీ ప్లస్ హాట్ స్టారే దక్కించుకుంది. అప్పట్లో అఖండ ఓటీటీలో ఓ సంచలనాన్ని సృష్టించింది. దాంతో మరోసారి బాలయ్య చిత్రాన్ని భారీ ధరకు కొనుగోలు చేసింది హాట్ స్టార్. మరి ఈ సారి వీర సింహారెడ్డి ఓటీటీలో ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టిస్తుందో వేచి చూడాలి. ఇక రూ. 74 కోట్ల బ్రేక్ ఈవెన్ తో బరిలోకి దిగిన బాలయ్య.. బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాటలో పయణిస్తున్నాడు.