‘వీరసింహారెడ్డి’ మూవీ పేరు చెప్పగానే పవర్ ఫుల్ బాలయ్యతోపాటు హీరోయిన్ హనీరోజ్ కూడా కచ్చితంగా గుర్తొస్తుంది. ఎందుకంటే సినిమాలో పెద్ద బాలయ్యకు మరదలిగా, చిన్న బాలయ్యకు తల్లిగా డిఫరెంట్ షేడ్స్ లో కనిపించి ఆకట్టుకుంది. ఈ సినిమా హిట్ కావడంతో హనీ క్రేజ్ తోపాటు యూత్ లో ఫాలోయింగ్ కూడా పెరుగుతూనే ఉంది. అందుకు సంబంధించిన ఓ వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది చూసిన నెటిజన్స్.. హనీరోజ్ క్రేజ్ చూసి షాకవుతున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. 2008లోనే ‘ఆలయం’ అనే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ హనీరోజ్ పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. ఆ తర్వాత 2014లో ‘ఈ వర్షం సాక్షిగా’ అనే మరో మూవీ చేసింది కానీ టాలీవుడ్ లో ఫేమ్ అయితే తెచ్చుకోలేకపోయింది. అలా సొంత ఇండస్ట్రీ మలయాళంలోనే పూర్తిగా సెటిలైపోయింది. గతేడాది వచ్చిన మోహన్ లాల్ ‘మాన్ స్టర్’లో మంచు లక్ష్మీతో కలిసి నటించింది. ఈ సంక్రాంతికి బాలయ్య ‘వీరసింహారెడ్డి’లో క్యూట్ లుక్స్ తో కుర్రకారుకి కితకితలు పెట్టేసింది. ఈ బ్యూటీ అందాన్ని చూసి అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు.
ఇక తాజాగా కేరళ మన్నార్ కడ్ లోని ఓ హోమ్ అప్లయన్సెస్ షోరూం ఓపెనింగ్ కు గెస్ట్ గా వెళ్లింది. ఈమె వస్తుందని తెలిసి చుట్టుపక్కల జిల్లాల నుంచి కుర్రాళ్లు వచ్చేశారు. హనీరోజ్ కోసం వచ్చిన వేలాదిమంది జనాన్ని చూసి పోలీసులు, బౌన్సర్లు షాకయ్యారు. సదరు జనాన్ని కంట్రోల్ చేయడానికి నానా తిప్పలు పడ్డారు. ఇక షాప్ ఓపెనింగ్ అయిపోయి తిరిగి వెళ్తున్న టైంలో హనీరోజ్ తో సెల్ఫీల కోసం ఫ్యాన్స్ ఎగబడ్డారు. అలా ఓసారి ఆమెపై పడిపోయారు. చివరకు ఎలాగోలా కారెక్కి ఇంటికి వెళ్లిన హనీరోజ్.. ఈ వీడియోని తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. దీన్ని నెటిజన్స్ అవాక్కవుతున్నారు. హనీని కుర్రాళ్లు ఉక్కిరిబిక్కిరి చేసేశారుగా అని మాట్లాడుకుంటున్నారు. మరి ఈ వీడియో చూసిన తర్వాత మీకేం అనిపించింది. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.