నందమూరి బాలకృష్ణ.. బాక్సాఫీస్ దగ్గర విశ్వరూపం చూపిస్తున్నారు. ‘వీరసింహారెడ్డి’గా ఇక్కడా అక్కడా అనే తేడా లేకుండా రచ్చ రచ్చ చేస్తున్నాడు. మాస్ ఆడియెన్స్ అయితే రెచ్చిపోతున్నారు. ఇక బాలయ్య ఫ్యాన్స్ అయితే ఫుల్ గా ఊగిపోతున్నారు. అరిచి అరిచి గోల గోల చేస్తున్నారు. ఎందుకంటే బాలయ్య నుంచి ఎలాంటి సినిమా కావాలని అనుకున్నారో.. అలాంటి సినిమా, అది కూడా సంక్రాంతి టైంలో వచ్చేసరికి భూమ్మీద నిలబడట్లేదు. దీంతో ఫస్ట్ డే కలెక్షన్స్ అదరగొట్టాయి. దీంతో బాలయ్య అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. బాలయ్య అంటే మాస్, మాస్ అంటే బాలయ్య. ఇక బాలయ్యగానీ రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఫ్యాక్షన్ స్టోరీతో మూవీ చేస్తే రిజల్ట్ వేరే లెవల్లో ఉంటుంది. ఇప్పుడు కూడా అదే జరిగింది. సాధారణంగా బోయపాటి-బాలయ్యది బెస్ట్ కాంబినేషన్. ఇప్పుడు ఆ లిస్టులోకి డైరెక్టర్ గోపీచంద్ మలినేని వచ్చి చేరాడా అనిపించింది. ఎందుకంటే ఫైట్స్ ఆ రేంజ్ లో ఉన్నాయి. సినిమా మొదలైన దగ్గర నుంచి బాలయ్య యాక్షన్, డైలాగ్స్ ఇవే ఉంటాయి. ఈ క్రమంలోనే నార్మల్ ఆడియెన్స్ కాస్త బోర్ ఫీలవుతున్నారు. ఫ్యాన్స్ మాత్రం ‘జై బాలయ్య’ అని రచ్చ రచ్చ చేస్తున్నారు.
ఇక ఫుల్ ఆన్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తీసిన ‘వీరసింహారెడ్డి’.. తొలిరోజు రూ.54 కోట్లకుపైగా గ్రాస్ సాధించింది. ఇందుకు సంబంధించిన పోస్టర్ ని మైత్రీ మూవీ మేకర్స్ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఈ క్రమంలోనే బాలయ్య ‘అఖండ’ ఫస్ట్ డే కలెక్షన్స్ ని క్రాస్ చేసినట్లు తెలుస్తోంది. అలానే తాజాగా థియేటర్లలోకి వచ్చిన తమిళ సినిమాలు వారిసు-రూ.27 కోట్లు, తునివు-రూ.26 కోట్లు.. బాలయ్య సినిమాకు చాలా దూరంలో ఉండిపోయాయి. కేవలం తెలుగులో మాత్రమే రిలీజైన బాలయ్య సినిమా.. ఈ రేంజ్ వసూళ్లు సాధించిందంటే ఆశ్చర్యపోవాల్సిన విషయమే. ఒకవేళ మిగతా భాషల్లోనూ డబ్ అయ్యుంటే మాత్రం కలెక్షన్స్ ఇంకా పెరిగేవి అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మరి బాలయ్య ‘వీరసింహారెడ్డి’ ఫస్ట్ డే కలెక్షన్స్ పై మీ అభిప్రాయమేంటి? కింద కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
బాలయ్య బాబు బాక్సాఫీస్ ఊచకోత 🔥🔥
VEERA MASS BLOCKBUSTER #VeeraSimhaReddy grosses Massive 54 CR on Day 1 🔥
Book your tickets now!
– https://t.co/SzgoK7HjZVNatasimham #NandamuriBalakrishna @megopichand @shrutihaasan @varusarath5 @OfficialViji @MusicThaman @SonyMusicSouth pic.twitter.com/PrfB4kckhX
— Mythri Movie Makers (@MythriOfficial) January 13, 2023