చాలారోజుల తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. స్టార్ హీరో బాలయ్య హిట్ కొట్టేశారు! తన మార్క్ స్టోరీతో ప్రేక్షకుల్ని ఫుల్ గా ఎంటర్ టైన్ చేస్తున్నారు. గాడ్ ఆఫ్ మాసెస్ అనిపించుకుంటున్నారు. అయితే సంక్రాంతికి బాలయ్యతో పాటు చిరు కూడా వచ్చారు. దీంతో ఇద్దరు సీనియర్ హీరోల మధ్య విపరీతమైన పోటీ ఉంది. అందుకు తగ్గట్లే కలెక్షన్స్ విషయంలో తొలి రెండు రోజులు నువ్వానేనా అనే రేంజులో పోటీపడ్డారు. కానీ వీకెండ్ పూర్తయ్యేసరికి మాత్రం లెక్కలు పూర్తిగా మారిపోయాయి.
ఇక విషయానికొస్తే.. నందమూరి బాలకృష్ణ అనగానే ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేసేది దాదాపు మాస్ సినిమాలే. అందుకు తగ్గట్లే తన ప్రతి సినిమా కూడా అదే జానర్ లో ఉండేలా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అలా ఆయన ఫ్యాన్ బాయ్ గోపీచంద్ మలినేని తీసిన సినిమానే ‘వీరసింహారెడ్డి’. రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ స్టోరీకి తోడు బాలయ్య మాస్ గెటప్.. అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తోంది. అలా తొలిరోజు భారీ వసూళ్లు సాధించిన ఈ సినిమా నాలుగో రోజు వచ్చేసరికి నిలకడగా కలెక్షన్స్ సాధిస్తోంది. ఆదివారం, వరల్డ్ వైడ్ గా రూ 15 కోట్లకు పైనే షేర్ వసూలు చేసినట్లు కనిపిస్తోంది.
వీరసింహారెడ్డి.. కేవలం తెలుగు వెర్షన్ మాత్రమే రిలీజైనప్పటికీ ఆంధ్రా, తెలంగాణతోపాటు ఓవర్సీస్ లోనూ దుమ్మరేపే కలెక్షన్స్ సాధిస్తుంది. అయితే తొలిరోజు బాగానే వచ్చినప్పటికీ.. రెండు, మూడు రోజుల్లో కాస్త వసూళ్లు తగ్గినట్లు కనిపించాయి. కానీ నాలుగో రోజు మాత్రం ఆదివారం కావడంతో చాలాచోట్ల హౌస్ ఫుల్ షోలు పడినట్లు కనిపిస్తుంది. ఈ క్రమంలోనే నాలుగు రోజులకు కలిపి వరల్డ్ వైడ్ రూ.104 కోట్లకు పైనే గ్రాస్ వసూలు చేసినట్లు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అనౌన్స్ చేసింది. అందుకు సంబంధించిన పోస్టర్ ని కూడా రిలీజ్ చేసింది. మరి ‘వీరసింహారెడ్డి’ కలెక్షన్స్ చూసి మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.
The GOD OF MASSES strikes big this Sankranthi 🔥🔥🔥
VEERA MASS BLOCKBUSTER #VeeraSimhaReddy grosses 104 CR+ worldwide & going strong 💥💥
Natasimham #NandamuriBalakrishna @shrutihaasan @megopichand @varusarath5 @OfficialViji @MusicThaman @RishiPunjabi5 @SonyMusicSouth pic.twitter.com/R3dHGvUWBp
— Mythri Movie Makers (@MythriOfficial) January 16, 2023