ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ వీబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ 8వ వార్షికోత్సవ వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అత్యంత వైభవంగా బుల్లితెర అవార్డ్స్ 2022 నిర్వహించారు. ఈ కార్యక్రమం డిసెంబర్ 18న డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ, రోడ్ నం.45 జూబ్లీహిల్స్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఎమ్. మురళీమోహన్, ఎమ్మెల్సీ తక్కెళ్ల పల్లి రవేందర్ రావు, అంబికా కృష్ణ, డాక్టర్. వి.కె. నరేష్, డాక్టర్ మాదాల రవి, హీరో సంపూర్ణేష్ బాబు, మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచే తదితరులు హాజరయ్యారు. బుల్లితెర అవార్డ్స్ 2022లో భాగంగా లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డును వై. విజయ, ఆల్ రౌండర్ అవార్డును కే.వి.ప్రదీప్ సొంతం చేసుకున్నారు.
ఇదే కార్యక్రమంలో ఈటీవీ, జెమిని టీవీ, జీ తెలుగు, స్టార్ మాలో ప్రసారమయ్యే సీరియల్స్ నుండి వివిధ విభాగాల్లో దాదాపు 64 మంది కళాకారులు, టెక్నీషియన్స్ కు అవార్డులు అందజేశారు. ఈ అవార్డు ఫంక్షన్ టైటిల్ స్పాన్సర్‌గా ఏవీ ఇన్‌ఫ్రాక్రాన్, పవర్డ్ బై వీవీకే హౌసింగ్, భారతి బిల్డర్స్, అసోసియేటెడ్ స్పాన్సర్స్‌గా పారిజాతా హోమ్స్, క్వయర్స్ అండ్ యాడ్స్, ప్రాపీ ఇండియా.. సపోర్ట్ బైగా శ్రీని ఇన్‌ఫ్రా వ్యవహరించింది. మీడియా పార్ట్‌నర్‌గా సుమన్ టీవీ వ్యవహరించింది. ఈ ఫంక్షన్‌లో ఎప్పటిలాగే 10 మంది పేద కళాకారులకు ఆర్ధిక సాయం చేశారు. మునుపెన్నడూ లేని విధంగా అతిరథ మహారథుల సమక్షంలో ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. వి.బి. ఎంటర్టైన్మెంట్స్ సంస్థ అధినేత విష్ణు బొప్పనను అందరూ ప్రశంసలతో కొనియాడారు.