సినీ ఇండస్ట్రీలో నటీనటుల మధ్య స్నేహం, ప్రేమ, ఆ తరువాత పెళ్లి అనేది చాలా కామన్. ఇలా రీల్ లైఫ్ బంధాన్ని రియల్ లైఫ్ వరకు తీసుకెళ్లిన జంటలు చాలానే ఉన్నాయి. తాజాగా ఈ లిస్ట్ లోకి వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి కూడా చేరబోతున్నారు. అవును నిజమే..!
సినీ ఇండస్ట్రీలో నటీనటుల మధ్య స్నేహం, ప్రేమ, ఆ తరువాత పెళ్లి అనేది చాలా కామన్. ఇలా రీల్ లైఫ్ బంధాన్ని రియల్ లైఫ్ వరకు తీసుకెళ్లిన జంటలు చాలానే ఉన్నాయి. తాజాగా ఈ లిస్ట్ లోకి వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి కూడా చేరబోతున్నారు. అవును నిజమే..!
మెగా బ్రదర్ ఇంట మరో వారంలో బాజాలు మోగనున్నాయి. నాగబాబు తనయుడు వరుణ్ తేజ్, స్టార్ హీరోయిన్ లావణ్య త్రిపాఠిల పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల నుండి సమాచారం. ఈ నెల 9వ తేదీన ఇరు కుటుంబాల సమక్షంలో ఈ వేడుకని ఘనంగా జరిపించబోతున్నారట. ఇందుకు కావాల్సిన పనులు కూడా ఇప్పటికే మొదలయ్యాయని, ఇండస్ట్రీలోని పెద్ద తలలకి అప్పుడే ఆహ్వానం కూడా అందిందని సమాచారం.
నిజానికి లావణ్య త్రిపాఠితో వరుణ్ తేజ్ ప్రేమలో పడ్డాడన్న వార్తలు చాలాసార్లు బయటకి వచ్చాయి. కానీ.. వీరిద్దరితో పాటు మెగా ఫ్యామిలీ స్టార్స్ కూడా ఈ వార్తలను కొట్టి పారేస్తూ వచ్చారు. అయితే.., గత రెండు నెలలుగా ఈ వ్యవహారంలో మార్పు వచ్చింది. నాగబాబు కూడా ఈ విషయంలో హింట్స్ ఇస్తూ వచ్చారు. ఇదే సమయంలో వరుణ్, లావణ్య ఇద్దరూ కలిసి వెకేషన్స్ కి వెళ్లడం కూడా ఇండస్ట్రీలో చర్చలకు కారణం అయ్యింది. ఇప్పుడు అవన్నీ నిజం చేస్తూ ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతుండటం అందరికీ ఆనందాన్ని కలిగిస్తోంది. వరుణ్-లావణ్య కలిసి మొదటిసారి మిస్టర్ అనే మూవీలో నటించారు. ఆ మూవీ అంతగా కిక్ కాకపోయినా.. మరుసటి ఏడాదే అంతరిక్షం మూవీలో కూడా వీరి కాంబో రిపీట్ అయ్యింది. ఈ రెండు సినిమాల షూటింగ్ సమయంలోనే వీరి మధ్య లవ్ మ్యాజిక్ జరిగిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం వరుణ్, లావణ్య వెకేషన్ లో ఉన్నారు. ఇద్దరూ కలిసి రోమ్ లోనే ఉన్నట్టు వారి పోస్ట్ లు చూసిన వారికి అర్ధం అవుతోంది. వరుణ్ రోమ్ లో ఉన్నట్లు పోస్ట్ పెట్టడం, వెంటనే లావణ్య కూడా టూర్‌లో ఉన్నట్లు చెప్పడం విశేషం. దీంతో వీరిద్దరు కలిసే విదేశీ పర్యటనకు వెళ్లారని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ జంట రేపో, మాపో హైదరాబాద్ చేరుకోవడం, ఆ తరువాత అఫీషయల్ గా ఓ ప్రకటన రావడం, 9వ తేదీ ఎంగేజ్మెంట్ జరిగిపోవడం ఖాయమన్న సమాచారం అందుతోంది. ఇక మెగా ఫ్యామిలీతో పాటు, ఇండస్ట్రీ నుండి కొద్దిమంది స్టార్స్ మాత్రమే ఈ వేడుకకు హాజరు కాబోతున్నట్టు సమాచారం. మరి.. రిల్ లైఫ్ కపుల్ గా నటించిన వరుణ్- లావణ్య ఇలా నిజంగానే పెళ్లి పీటలు ఎక్కబోతుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.