మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సయీ మంజ్రేకర్ హీరో హీరోయిన్లుగా డెబ్యూ డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి తెరకెక్కించిన చిత్రం ‘గని’. ఎంతో ప్రతిష్టాత్మకంగా సిద్దు ముద్ద, అల్లు బాబీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో కన్నడ హీరో ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర, జగపతి బాబు, నదియా కీలకపాత్రలు పోషించారు. తమన్ సంగీతం అందించిన ఈ సినిమాపై మెగాఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఈ సినిమా ఏప్రిల్ 8న ప్రేక్షకుల ముందుకొచ్చి పాజిటీవ్ టాక్ సొంతం చేసుకుంది. వరుణ్ ఈ చిత్రం కోసం చాలా కష్టపడి 6 ప్యాక్ బాడీని డెవలప్ చేసాడు. బాక్సింగ్ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామా మూవీ ఇది. అయితే తాజాగా ‘గని’ చిత్రం కి సంబంధించి ఓ విషయం బయటకి వచ్చింది.
‘గని’ మూవీ ఓటీటీలో దర్శనం ఇచ్చేందుకు రెడీ అవుతోందని సమాచారం. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని ‘ఆహా’ సొంతం చేసుకున్నటు టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రం మే 6, 2022 నుండి ఆహాలో స్ట్రీమింగ్ అవుతుందని తెలుస్తోంది. సాధారణంగా సినిమా థియేటర్లలో విడుదలైన 4-5 వారాల తర్వాత ఓటీటీలోకి వస్తుంది. అయితే కొన్ని సినిమాలు మాత్రం 2-3 వారాల్లోపే డిజిటల్ లోకి వస్తున్నాయి. గతంలో పుష్ప, భీమ్ల నాయక్, రాధే శ్యామ్ కూడా ఓటీటీలో విడుదలై సందడి చేశాయి. అలానే త్వరలో గని కూడా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. దీనిపైన అధికార ప్రకటన రావాల్సి ఉంది. మరి.. ఈవిషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.