హీరోయిన్ లావణ్య త్రిపాఠి.. హీరో వరుణ్ తేజ్ త్వరలో ఎంగేజ్‌మెంట్ చేసుకోబోతున్నారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. పెద్ద పెద్ద మీడియా సంస్థలు కూడా వీటిపై వార్తలు రాశాయి.
సినిమా ఇండస్ట్రీలోని సెలెబ్రిటీల వ్యక్తిగత విషయాల గురించి పుకార్లు రావటం సర్వ సాధారణం. ముఖ్యంగా హీరో,హీరోయిన్ల రిలేషన్‌ల గురించి మీడియాలో ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంటుంది. ఆ హీరో ఈ హీరోయిన్‌తో రిలేషన్‌లో ఉన్నాడని.. ఆ నటి.. ఆ నటుడితో తిరుగుతోందని పుకార్లు రావటం మామూలైపోయింది. సినిమా వాళ్ల పెళ్లి విషయాల్లో అయితే, ఇంకేం చెప్పనక్కర్లేదు. ఇష్టం వచ్చినట్లు మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ న్యూస్‌లు తెగ వచ్చేస్తుంటాయి. ఆ వార్తల్లో నిజమెంతుందో తెలీదు కానీ, వాటిని చదివిన జనాలు మాత్రం నోరెళ్ల బెడుతుంటారు. కొన్ని నెలల క్రితం మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి రిలేషన్‌లో ఉన్నారని, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని తెగ వార్తలు వచ్చాయి.
ఈ వార్తలపై మెగా బ్రదర్ నాగబాబు, హీరోయిన్ లావణ్య త్రిపాఠి క్లారిటీ ఇచ్చారు. రిలేషన్ వార్తలు ఒట్టి పుకార్లేనని తేల్చి చెప్పారు. దీంతో ఆ సమయానికి ఆ వార్తలకు బ్రేక్ పడింది. అయితే, తాజాగా, మరోసారి వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లి గురించి వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరూ త్వరలో ఎంగేజ్‌మెంట్ చేసుకోబోతున్నారని కొన్ని మీడియా సంస్థలు వార్తలు రాశాయి. అలా వారి ఎంగేజ్‌మెంట్‌పై వార్తలు రాసిన మీడియా సంస్థల్లో పెద్ద పెద్ద మీడియా సంస్థలు కూడా ఉండటం గమనార్హం. అసలు ఆ వార్తలు నిజమేనా అన్న క్లారిటీ లేకుండానే సదరు మీడియా సంస్థలు వార్తలు రాయటం గమనార్హం.
ఈ వార్తలపై మెగా ఫ్యాన్స్ చాలా సీరియస్ అవుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా పేరున్న ఓ పెద్ద ఫ్యామిలీ గురించి ఓ వార్త రాసేటప్పుడు ఓ క్లారిటీ తీసుకుని రాయాలని సూచిస్తున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండా పుకార్లను వార్తలుగా ఎలా రాస్తారంటూ మండిపడుతున్నారు. ఇకపై మెగా ఫ్యామిలీ గురించి ఏదైనా వార్త రాసే ముందు ఓ సారి ఎంక్వైరీ చేసుకున్నాక లేదా అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే వార్తలు రాయాలని అంటున్నారు. మరి, వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిల ఎంగేజ్‌మెంట్ అని వస్తున్న పుకార్లపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.