Kiara Advani: సాధారణంగా ఓ సినిమా థియేట్రికల్ రిలీజైన తర్వాత హీరో హీరోయిన్లు సక్సెస్ మీట్ లలో పాల్గొంటుంటారు. అలాగే సినిమా హిట్ అయినందుకు ఆనందం వ్యక్తం మీడియా ముఖంగా ఎన్నో విషయాలు షేర్ చేసుకుంటారు. అయితే.. ఓ సినిమా సక్సెస్ అయ్యాక హీరో హీరోయిన్లు అప్పుడప్పుడు మ్యాగజైన్ ఫోటోషూట్స్ చేస్తుంటారు. ఫోటోషూట్ లలో ఫోటోలకు పోజులివ్వడం వరకు ఓకే.. కానీ, అంతకుమించి హీరో హీరోయిన్స్ మధ్య ఏం జరిగినా అది వివాదాలకు దారి తీస్తుంది.
తాజాగా బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, హీరోయిన్ కియారా అద్వానీల మధ్య జరిగిన ఓ మ్యాగజైన్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో వివాదానికి తెరలేపింది. ఇటీవలే వరుణ్, కియారా జంటగా ‘జుగ్ జుగ్ జియో’ అనే సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చి హిట్ టాక్ సొంతం చేసుకుంది. అలాగే ఆన్ స్క్రీన్ పై వీరిద్దరి కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వడం సినిమా రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. అయితే.. సినిమా హిట్ అయిన తర్వాత సక్సెస్ మీట్స్ లో పాల్గొంటున్నారు ఈ జంట.
ఇక ఇక్కడే అసలు వ్యవహారం మొదలైంది. సినిమాలో సన్నివేశం అవసరాన్ని బట్టి హీరో హీరోయిన్ల మధ్య రొమాన్స్ అనేది సహజం. కానీ.. సినిమా అయిపోయాక ఓ ఫోటోషూట్ లో పాల్గొన్నారు వరుణ్, కియారా. ఇద్దరూ దగ్గరగా క్లోసప్ లో ఫోటోలకు బాగానే పోజులిస్తున్నారు.. ఎందుకో మధ్యలో వరుణ్ కాస్త చొరవ తీసుకొని కియారా బుగ్గపై ముద్దు పెట్టేశాడు. ఇది ప్రస్తుతం బాలీవుడ్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ‘సినిమా అయిపోయాక ఈ ముద్దుల వ్యవహారాలేంటి? ఇకనైనా చాలించండి.. వరుణ్ నీకు ఆల్రెడీ పెళ్లయింది.. గుర్తుందా?’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్. మరి వరుణ్ – కియారాల వ్యవహారంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Jab Aadmi shoot Karte Huwe Mood Main Aa Jata Hai Toh Kuch Aisa Ho Jata Hai. pic.twitter.com/3SzXU6M5WR
— KRKBOXOFFICE (@KRKBoxOffice) August 1, 2022