ప్రపంచం మొత్తం ఆడవాళ్ళ చుట్టూనే తిరుగుతుంది. మందు సిటింగ్ వేస్తే ఆమె గురించే, గ్యాప్ దొరికితే ఆమె గురించే. ఆడదాని పేరు తీయకుండా ఏ మగాడూ ఉండలేడు. ఆరోజు మంచింగ్ కి స్టఫ్ ఐటం ఆడది అని ఫిక్స్ అవుతారు. మందులో ఉన్నా, మామూలుగా ఉన్నా ఆడవాళ్ళ గురించి అసభ్యకరంగా మాట్లాడుకోవడం అనేది కొంతమందికి ఒక జబ్బు. ఈ జబ్బు సినిమా ఇండస్ట్రీలో మరీ ఎక్కువ. అందుకే అవకాశాల కోసం వచ్చే అమ్మాయిలని లొంగదీసుకునే ప్రయత్నం చేస్తారు.
క్యాస్టింగ్ కౌచ్.. ఈ పదం గత కొన్ని రోజులుగా అటు మహిళా ఆర్టిస్టులకి, ఇటు బడాబాబులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. క్యాస్టింగ్ కౌచ్ భారిన పడ్డామని ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు, నటీమణులు తమ బాధని బయటకు చెప్పుకున్నారు. బాలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా అనేక మంది ఈ క్యాస్టింగ్ కౌచ్ ను ఫేస్ చేశామని అన్నారు. తాజాగా ఓ హీరోయిన్ కూడా ఈ జాబితాలోకి చేరిపోయింది. తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ కి గురయ్యానని తెలిపింది.
4 లెటర్స్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన అప్సర రాణి అలియాస్ అంకిత మహారాణా.. కెరీర్ ప్రారంభంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ చేదు నిజం గురించి వెల్లడించింది. కన్నడ పరిశ్రమకు చెందిన ఓ డైరెక్టర్.. ఒక సినిమాలో అవకాశం ఇస్తానని అంటే ఆమె వెళ్లిందట. తీరా వెళ్ళాక.. అతను గదిలోకి పిలిచి, అతని కోరిక తీరిస్తేనే అవకాశం ఇస్తానని చెప్పారట. దీంతో ఆమె భయపడి అక్కడి నుంచి వచ్చేశారట. ఆ తర్వాత తెలుగులో అవకాశాలు వచ్చాయని వెల్లడించింది. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘థ్రిల్లర్’ షార్ట్ ఫిలిం తో ఈమెకు బాగా క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత క్రాక్, సీటీమార్ సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ లో నర్తించింది. మరి తనకు ఎదురైన ఈ అనుభవంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.