కొత్త ఏడాది ప్రాంరభం నుంచే ఇండస్ట్రీలో విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. రెండు రోజుల క్రితమే.. టాలీవుడ్ రచయిత పెద్దాడ మూర్తి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ విషాదం నుంచి కోలుకోకముందే.. మరో ప్రముఖుడు మృతి చెందాడు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం వారీసు. తెలుగులో వారసుడు పేరుతో సంక్రాంతికి విడుదల కానుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది. సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో పెరిగాయి. ప్రస్తుతం చిత్రబృందం.. ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉండగా.. ఓ విషాదం చోటు చేసుకుంది.
వారసుడు సినిమా రిలీజ్‌కు ముందే.. ఆ చిత్ర ఆర్ట్ డైరెక్టర్.. సునీల్ బాబు మృతి చెందాడు. గుండెపోటుతో కేరళ ఆస్పత్రిలో చేరిన ఆయన.. అక్కడ చికిత్స పొందుతూ.. గురువారం రాత్రి తుదిశ్వాస విడిచాడు. సినిమా రీలిజ్‌కు ముందే ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం పట్ల వారీసు బృందం.. విచారం వ్యక్తం చేస్తోంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నారు. ఇక సునీల్ బాబు.. గత ఏడాది విడుదలైన సీతారామంతో పాటు ఎం.ఎస్ ధోని, గజిని, లక్ష్యం వంటి ఎన్నో సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేశారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక సునీల్ బాబుకు భార్య, కుమార్తె ఆర్య సరస్వతి ఉన్నారు. ఆయన అంత్యక్రియలు శుక్రవారం జరగనున్నాయి.
Deeply saddened to hear that #SunilBabu is no more… In your art, we will meet you again!
Heartfelt condolences to his family. pic.twitter.com/GCIoMsvy9D
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) January 6, 2023