వరలక్ష్మీ శరత్ కుమార్ మొదటగా సందీప్ కిషన్ చేసిన తెనాలి రామకృష్ణ మూవీతో అరంగేట్రం చేశారు. వరలక్ష్మి శరత్ కుమార్ కి తమిళంలో ఒక రేంజ్ లో క్రేజ్ ఉంది. అక్కడ నెగెటివ్ షేడ్స్ కలిగిన లేడీ రోల్ చేయాలంటే ముందుగా ఆమెను కలవాల్సిందే. లేడీ విలన్ పాత్రలకు వరలక్ష్మి కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయింది. ఆ తరహా పాత్రలకి ఆమె హీరోయిన్ తో సమానమైన పారితోషికం అందుకుంటోంది. విజయ్ హీరోగా వచ్చి ‘సర్కార్’ సినిమాలో ఆమె చేసిన నెగెటివ్ రోల్‌కు డిమాండ్ పెరిగింది. మురగదాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో విజయ్‌కు గట్టి పోటీ ఇచ్చింది వరలక్ష్మి. పవర్‌ఫుల్ ఐరన్ లేడీగా ప్రత్యేకమేన గుర్తింపు పొందింది. అలా తమిళంలో ఆమె ఫుల్ బిజీగా ఉంది. అయినా తెలుగు నుంచి పవర్ఫుల్ రోల్స్ వెళితే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తోంది.
అయితే దాని తర్వా త రవితేజతో చేసిన ‘క్రాక్’ సినిమాలో జయమ్మ పాత్రను వరలక్ష్మీ పండించిందనే చెప్పాలి. రవితేజకు ఈ సినిమా పెద్ద హిట్ ఇచ్చింది. వరుసగా ఇద్దరు హీరోలకు మంచి హిట్లు ఇవ్వడంతో వరలక్ష్మి కి ఆఫర్లు పెరిగాయి. ఆమెను గోల్డెన్ లెగ్‌గా కీర్తిస్తూ సినిమా ఆఫర్లు వస్తున్నాయి. ఇక రీసెంట్‌గా అల్లరి నరేష్ నాంది సినిమాలో పవర్ ఫుల్ లాయర్ గా ఎంతగా ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే. దీంతో ఆమెకు పవర్ ఫుల్ లేడీ పాత్రలు క్యూ కడుతున్నాయి. అలాంటి పాత్ర ఏది ఉన్నా ఆమెనే ఎంచుకుంటున్నారు సినిమా మేకర్స్.
త్వరలోనే బాలయ్య సినిమాలో కూడా చేయబోతోందని తెలుస్తోంది. అలాగే ‘జాంబిరెడ్డి’ మూవీ డైరెక్టర్ అయిన ప్రశాంత్ వర్మ తీస్తున్న హనుమాన్ మూవీలో కూడా ఛాన్స్ కొట్టేసిందంట. ఈ సినిమాలో హీరోగా తేజ సజ్జ నటించనున్న సంగతి తెలిసిందే.