దివంగత నటి మంజుల, సీనియర్ నటుడు విజయకుమార్ దంపతుల పెద్ద కుమార్తె వనిత విజయకుమార్‌కి వివాదాలు కొత్తేం కాదు. నిత్యం వివాదాల్లో నిలిచే వనిత.. తాజాగా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆ వివరాలు..
నటి వనిత విజయ్ కుమార్.. తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. దేవి చిత్రం ద్వారా వనిత విజయ్ కుమార్ తెలుగు ప్రేక్షకులు పరిచయం అయ్యింది. టాలీవుడ్‌లో కన్నా తమిళ్‌లో బాగా పాపులర్ అయ్యింది. తమిళ్ బిగ్ బాస్‌లో కూడా పాల్గొంది. ఇక సినిమాలు, షోలు కాకుండా.. వ్యక్తిగత జీవితంలో నిత్యం ఏదో వివాదంలో వనిత విజయ్ కుమార్ పేరు నిత్యం వార్తల్లో నిలుస్తుంటుంది. పెళ్లి, విడాకులు, కుటుంబ సభ్యులతో వివాదాలు, తండ్రితో గొడవలు వంటి విషయాలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంది వనిత విజయ్ కుమార్. ఇక తాజాగా మరోసారి ఆమె పేరు మీడియాలో మారు మోగి పోయింది. కారణం.. పీటర్ పాల్ మృతి. అనారోగ్యం కారణంగా కొన్ని రోజుల క్రితం నిర్మాత పీటర్ పాల్ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నటి వనిత విజయ్ కుమార్ మూడో భర్త మృతి అంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇక తాజాగా వనిత ఈ వార్తలపై స్పందిస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాలు..
పీటర్ పాల్ మృతి నేపథ్యంలో వనిత విజయ్ కుమార్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీనిలో వనిత విజయ్ కుమార్ ఇలా రాసుకొచ్చింది. ‘‘పీటర్ పాల్ మరణించిటన్లు తెలిసిన తర్వాత.. దీనిపై నేను స్పందించాలా లేదా అని చాలా ఆలోచించాను. ఈ విషయం గురించి చాలా ఓపిక పట్టాను. కానీ మీరు నాకు అవకాశం లేకుండా చేశారు. అందుకే ఇలా స్పందించాల్సి వస్తోంది. అన్ని మీడియా సంస్థలు, న్యూస్ ఛానళ్ల మీద ఉన్న గౌరవంతో ఈ విషయం చెబుతున్నాను. పీటర్‌పాల్ నా భర్త కాలేదు. తనతో నాకు న్యాయబద్ధంగా వివాహం జరగలేదు’’ అంటూ షాకిచ్చింది వనిత.
‘‘2020లో మేం కొన్ని రోజుల పాటు రిలేషన్‌షిప్‌లో ఉన్నాం. అయితే ఆ బంధం.. అదే సంవత్సరం ముగిసింది. నేను ఆయన భార్యను కాదు. అతను నా భర్త కాదు. వనిత మూడో భర్త చనిపోయాడంటూ వార్తలు రాయడం ఆపండి. నాకు భర్తలేడు. ఏ విషయానికి నేను ఇప్పుడు బాధపడటం లేదు. ప్రస్తుతం నా జీవితాన్ని సంతోషంగా కొనసాగిస్తున్నాను. మీ అందరికీ ఇదే నా విన్నపం. దయచేసి ఇలాంటి వార్తలు రాయడం మానండి. మిస్ వనిత విజయ్‌కుమార్’’ అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఇది వైరలవుతోంది.
కాగా నిర్మాత పీటర్ పాల్-వనిత విజయకుమార్‌లు 2020లో జూన్ 27న క్రైస్తవ పద్దతిలో వివాహం చేసుకున్నారు. అతిథులందరి ముందు వెస్ట్రన్ స్టైల్‌లో పీటర్ పాల్-వనిత ఒకరినొకరు కిస్ చేసుకున్నారు. ఇక వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వెరల్ అయ్యాయి. అయితే వనిత-పీటర్‌ల వివాహం చట్టబద్ధం కాదని పీటర్ మొదటి భార్య ఎలిసబెత్ కోర్టును ఆశ్రయించింది. ఆ తర్వాత వనిత-పీటర్‌ల బంధం కూడా ఎక్కువ కాలం కొనసాగలేదు. వివాహం చేసుకున్న ఏడాదిలోపే వనిత.. పీటర్ నుంచి విడిపోయారు. ఆ తర్వాత తండ్రితో ఆస్తి గొడవలు, పెళ్లిళ్ల విషయంలో వివాదాలతో పలుమార్లు ఆమె వార్తల్లో నిలిచారు. ఇక తాజాగా పీటర్ తన భర్త కాదంటూ ఆమె చేసిన ట్వీట్ వైరలవుతోంది.
తమిళంలో బిగ్ బాస్ షోతో పాపులర్ అయిన నటి వనిత.. పలు సీరియళ్లు, సినిమాల్లో నటించారు. ప్రస్తుతం తెలుగులో సీనియర్ నటుడు నరేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మళ్ళీ పెళ్ళి’ చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆమె నరేష్ నిజ జీవితంలో రెండో భార్య అయిన రమ్య రఘుపతి పాత్రలో నటిస్తున్నారు. మరి వనిత విజయ్ కుమార్ చేసిన ట్వీట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
— Vanitha Vijaykumar (@vanithavijayku1) May 2, 2023