మళ్లీ పెళ్లి సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పాత్రలు చేసిన వారికి కూడా మంచి గుర్తింపు వచ్చింది. ప్రముఖ నటి వనిత విజయ్ కుమార్ ఈ సినిమాలో సౌమ్య సేతుపతి పాత్రలో నటించారు.
సంచలన సినీ కపుల్ నరేష్- పవిత్రా లోకేష్ జంటగా నటించిన చిత్రం ‘మళ్లీ పెళ్లి’. ఈ సినిమా ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నరేష్-పవత్రిల జీవితాల్లో చోటు చేసుకున్న యధార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా హిట్ టాక్‌ను తెచ్చుకోవటంతో పాటు.. మంచి కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఇక, మళ్లీ పెళ్లి సినిమాలో కీలక పాత్రలు చేసిన వారందరి నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమాలో సౌమ్య సేతుపతి పాత్రలో నటించిన వనిత విజయ్ కుమార్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఆ పాత్రలో ఆమె జీవించేశారని అంటూ ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే ‘మళ్లీ పెళ్లి’ సినిమాలో తన పాత్రపై తాజాగా ఆమె సంచలన కామెంట్లు చేశారు. తన పాత్ర ఎవరి స్పూర్తితో తీశారో తనకు తెలీదని అన్నారు. అసలు రమ్యా రఘుపతి ఎవరూ కూడా తనకు తెలీదంటూ షాకింగ్ కామెంట్లు చేశారు. ఆమె గురించి దర్శకుడు ఎంఎస్ రాజు ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. ఆమె మాట్లాడుతూ.. ‘‘ ఎక్కువగా ఏడ్చకూడదు. అతిగా నటించ కూడదు. మేకప్ లేకుండా సహజంగా తెరపై కనిపించాలని మాత్రమే డైరెక్టర్ నాకు చెప్పారు. ఒక పవర్ ఫుల్ పాత్ర ఉందని చెప్పారు.
కానీ, ఫలానా మహిళ నిజ జీవిత పాత్ర అని అస్సలు చెప్పలేదు. నాకు ఎలాంటి రిఫరెన్సులు కూడా ఇవ్వలేదు’’ అని స్పష్టం చేశారు. కాగా, సౌమ్య సేతుపతి పాత్ర.. నరేష్ మూడవ భార్య అయిన రమ్య రఘుపతి ఆధారంగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మొత్తం నరేష్- పవిత్రల ప్రేమ, ప్రేమ తర్వాత వారి కుటుంబాల్లో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో తెరకెక్కింది. దాదాపు అన్నీ నిజ జీవిత ఘటనలతోనే సినిమా తీశారు. మరి, వనిత.. రమ్య రఘుపతి ఎవరో తనకు తెలీదనడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.