మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో సక్సెస్‌ఫుల్ హీరో పంజా వైష్ణవ్ తేజ్. మొదటి సినిమా ‘ఉప్పెన’తోనే నటుడిగా మంచి గుర్తింపు పొందాడు వైష్ణవ్ తేజ్. అంతే, రెండో సినిమానే ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడితో పనిచేసే అవకాశం కొట్టేశాడు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమా నుంచి రేపు ఓ అప్‌డేట్ రాబోతోందని చిత్ర బృందం ప్రకటించింది. ఆగస్టు 20న ఉదయం 10.15 గంటలకు మూవీ ఫస్ట్ లుక్, టైటిల్ అనౌన్స్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాలో పంజా వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్‌సింగ్ నటించనుంది. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ‘కొండపొలం’ అనే నవల ఆధారంగా సినిమా తెరకెక్కుతున్న కారణంగా అదే పేరు ఖరారు చేస్తారేమో అని చిత్ర వర్గాల్లో ఎప్పటి నుంచో ఓ టాక్ నడుస్తోంది. ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతం సమకూరుస్తున్నాడు.
ఇటీవల పంజా వైష్ణవ్ తేజ్ ఓ చిత్రాన్ని ఖరారు చేశాడు. కేతిక శర్మ కథానాయికగా, గిరీశయ్య దర్శకత్వంలో వైష్ణవ్ నటించనున్నాడు. మరోవైపు క్రిష్ పవన్‌తో సోషియోఫాంటసీ ‘హరిహర వీరమల్లు’ సినిమా తీస్తున్నాడు. కథానాయకగా నిధి అగర్వాల్ నటిస్తోంది. నిధి బర్త్ డే సందర్భంగా పంచమిని పరిచయం చేసిన విషయం తెలిసిందే.
We are unveiling the first look on 20 Aug 21, at 1015am@YRajeevReddy1 #JSaiBabu @MangoMusicLabel @FirstFrame_ent pic.twitter.com/Jtn5vDD4TF
— Rakul Singh (@Rakulpreet) August 18, 2021