Uttej: తెలుగు చిత్ర సీమలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పదగ్గ వారిలో నటుడు ‘ఉత్తేజ్’ ఒకరు. ఆయన కేవలం నటుడిగానే కాదు.. మాటల రచయితగా కూడా తన సత్తా చాటారు. ఖడ్గం, నిన్నే పెళ్లాడతా వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలకు మాటలను అందించారు. ఇక, ఉత్తేజ్‌కు చిరంజీవి అంటే ఎనలేని అభిమానం. చిరును దైవ సమానులుగా భావిస్తుంటారు. వీలు చిక్కినప్పుడల్లా చిరుపై ఉన్న అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు. సోమవారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని చిరుపై ఓ కవిత రాశారు ఉత్తేజ్. ఆ కవితలో చిరుపై ఉన్న గురు భావాన్ని తెలియజేశారు.
చిరుపై ఉత్తేజ్ రాసిన కవిత
అన్నయ్యా..
పాదాభివందనం🙏
గురుపూజ దినోత్సవ
శుభాకాంక్షలు🌹🌹🌹
మీ నుండి ఎన్నో నేర్చుకున్నా…
డిసిప్లిన్, ప్రొఫెషనలిజం,
సమయస్ఫూర్తి,
కామన్ సెన్స్……..
సెట్ లో బిహేవియర్.. సెట్ లో అందుబాటులో ఉండటం…
ఇలా ప్రత్యక్షంగా.. పరోక్షంగా
మీరు ఎందరికో గురువు. 🙏
చిరంజీవులవ్వాలని..
మీ బొమ్మ గుండెల్లోనూ
గోడలపైనా…
పెట్టుకుని , ఏకలవ్య శిష్యుల్లా పరిశ్రమ కొచ్చి
హీరోలయ్యారు..
నటులయ్యారు…
🙏
మీ వెనక మిమ్మల్ని చూస్తూ
డాన్స్ ఆడి.. కొరియోగ్రాఫర్స్ గా…
మీ సినిమాలు చూస్తూ పెరిగి
అసిస్టెంట్ డైరెక్టర్స్ నుండి
డైరెక్టర్స్ అయ్యి మిమ్మల్ని డైరెక్ట్ చేసే దర్శకులుగా…
ఫైట్ మాస్టర్స్ గా..
మీ వేగానికి
కొత్త రాగాలని, కొత్త బీట్స్ ను
క్రియేట్ చేసే సంగీత దర్శకులుగా…
ఎందరెందరో……
మీ ఆశీస్సులతో
తెరంగేట్రం చేశారు..
🕺🏿🕺🏿🕺🏿🕺🏿🕺🏿🕺🏿
ఇక
మీ వ్యక్తిగత జీవితం నుండి,
మీ ఆదర్శమయ ప్రయాణం నుండి…స్ఫూర్తి పొంది
ఎందరో ఎన్నో గొప్ప పనుల వేపు అడుగేస్తున్నారు…
మా
ప్రొఫెషనల్ లైఫ్ కి,
పర్సనల్ క్యారెక్టర్ కి….
స్ఫూర్తి మీరు….🙏🙏🙏🙏🙏🙏
మీరు
గురువు – సద్గురువుల
కాంబినేషన్…
లవ్ యు అన్నయ్యా..
మీకు శుభం..
మీకు జయం..😊
….ఉత్తేజ్
ఇవి కూడా చదవండి : Allu Arjun: గణేష్ నిమజ్జనంలో అల్లు అర్జున్, అల్లు అర్హ.. గణపతి బప్పా మోరియా అంటూ సందడి..