పవన్ కల్యాణ్ సినిమా అంటే అంచనాలు ఎలా ఉంటాయో చెప్పాల్సిన అవసరం లేదు. అదే పవన్ అభిమాని డైరెక్ట్ చేస్తున్నాడంటే ఇంక ఫ్యాన్స్ కి పూనకాలే. ఇప్పటికే హరీశ్ శంకర్ గబ్బర్ సింగ్ సినిమాతో తన స్టామినా ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు మరోసారి ఉస్తాద్ భగత్ సింగ్ గా పవన్ తో సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ అయింది.
పవన్ కల్యాణ్ సినిమా అంటే అభిమానుల్లో ఉండే ఆ జోష్ మాములుగా ఉండదు. సినిమా అనౌన్స్ మెంట్ నుంచి బాక్సాఫీస్ హిట్ట కొట్టే దాకా ఫ్యాన్స్ ఫుల్ హడావుడి చేస్తుంటారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ జెట్ స్పీడుతో సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. పవన్- హరీశ్ శంకర్ కాంబోలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ క్రేజీ కాంబోని ప్రేక్షకులు వెండితెరపై వీక్షించనున్నారు. అంతేకాకుండా ఈ సినిమాకి రాక్ స్టార్ డీఎస్పీ మ్యూజిక్ అందించడం ఫ్యాన్స్ బోనస్ అనే చెప్పాలి. గబ్బర్ సింగ్ లో ఈ కాంబో ఎంత సక్సెస్ అయ్యిందో అందరికీ తెలుసు. ఇప్పుడు మరోసారి అదే రిజల్ట్ వస్తుందని ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. ఈసారి కేవలం ఎంటర్ టైన్మెంట్ మాత్రమే కాదు.. అంటూ హరీశ్ శంకర్ చెబుతుండటంతో అంచనాలు మరింత పెరుగుతున్నాయి.
అయితే ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఫస్ట్ గ్లింప్స్ రానే వచ్చింది. ఈ గ్లింప్స్ చూసిన తర్వాత ఫ్యాన్స్ మొత్తం ఒకటే మాట అంటున్నారు. ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోతుంది అని. ఎందుకంటే సినిమాలో గబ్బర్ సింగ్ ఫ్లేవర్ క్లియర్ గా కనిపిస్తోంది. పవన్ కల్యాణ్ కూడా ఒకసారి అగ్రెసివ్ గా, మరో ఫ్రేమ్ లో కామ్ అండ్ కంపోజ్డ్ గాని కనిపిస్తున్నాడు. అంటే కచ్చితంగా మిక్స్డ్ ఎమోషన్స్ ఉంటాయి. ఇంక లుంగీ కట్టి.. గన్ పెట్టుకున్న షాట్ మాత్రం పూనకాలు తెప్పిస్తోంది. పోలీస్ స్టేషన్ లో మరోసారి అంత్యాక్షరీ సీక్వెన్స్ రిపీట్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇది కచ్చితంగా గబ్బర్ సింగ్ సీక్వెల్ అనుకోవచ్చు. కథ పరంగా మార్పులు ఉన్నా కూడా.. పవన్ కల్యాణ్ ఎనర్జీ, జోష్, పర్ఫార్మెన్స్ మాత్రం గబ్బర్ సింగ్ సినిమానే గుర్తుచేస్తోంది. ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.