ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎన్టీఆర్ అంటే మ్యాన్ ఆఫ్ మాసెస్. విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో. క్లాస్ ఫ్యాన్స్ లో కూడా మాస్ యాంగిల్ ని బయటకు తీసే సత్తా ఎన్టీఆర్ ది. అలాంటి ఎన్టీఆర్ కొరటాల శివతో చేస్తున్న సినిమా అప్డేట్ బయటకు రావడంతో ఫ్యాన్స్ అప్పుడే సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసేసారు. ఎన్టీఆర్ కు తమదైన శైలిలో కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఏకంగా ఆకాశంలో విమానానికి బ్యానర్ కట్టి మరీ ఎన్టీఆర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా ఎదిగిపోయిన జూనియర్ ఎన్టీఆర్ కి ఇప్పుడు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోవడంతో పాటు అభిమానం కూడా బాగా పెరిగిపోయింది. మ్యాన్ ఆఫ్ మాసెస్ గా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తర్వాత చేయబోయే సినిమా ఎలా ఉంటుందా అన్న ఆసక్తి ఎక్కువైపోయింది అభిమానుల్లో. ఎన్టీఆర్ 30 అప్డేట్ ఎప్పుడిస్తావన్నా అంటూ సోషల్ మీడియాలో, ఈవెంట్స్ లో ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తూ వచ్చారు. మొత్తానికి మార్చి 23న షూటింగ్ స్టార్ట్ చేస్తున్నామని ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. దీంతో ఫ్యాన్స్ అబ్బా సాయిరాం అనుకుంటున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు గెలుచుకున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాతో ఎన్టీఆర్ అంతర్జాతీయ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నారు. కొమరం భీం పాత్రలో నెక్స్ట్ లెవల్ ప్రదర్శనను కనబరిచారు. ఆస్కార్ అవార్డు వేడుకల కోసం అమెరికా వెళ్ళినప్పుడు కూడా అక్కడి అభిమానులు ఎన్టీఆర్ కు ఘన స్వాగతం పలికారు. తాజాగా మరోసారి ఎన్టీఆర్ పై అభిమానాన్ని వినూత్న రీతిలో ప్రదర్శించారు అభిమానులు. ఎన్టీఆర్ కు ఆకాశంలో కృతజ్ఞతలు తెలియజేశారు. నేల మీద చెబితే ఏముంటుంది.. ఆకాశంలో చెబితేనే కదా కిక్ ఉంటుందని కాబోలు ఏకంగా విమానానికి బ్యానర్ కట్టి మరీ ఆకాశంలో ఎగరేశారు. బద్రీనాథ్ సినిమాలో నేల మీద కాదు, ఆకాశంలో ఎగరేసి మరీ కొడతాను అని చెప్పే డైలాగ్ ఉంటుంది. సరిగ్గా ఇలానే ఎన్టీఆర్ అభిమానులు తమ ప్రేమను ఆకాశంలో చూపించారు.
నేల మీద కాదు.. తమ అన్న ఎన్టీఆర్ పై ఉన్న ప్రేమను ఆకాశంలో చూపిస్తామని ఈ విధంగా చూపించారు. ‘కృతజ్ఞతలు ఎన్టీఆర్.. ఎన్టీఆర్ 30 కోసం వేచి ఉండలేము’ అంటూ ఒక బ్యానర్ ని విమానానికి కట్టి ఆకాశంలో ఎగరేశారు. దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఎన్టీఆర్ యూఎస్ అభిమానులు. ‘ప్రపంచ సినిమా హృదయం అయినటువంటి హాలీవుడ్ పై విమానం బ్యానర్ ను ఎగురవేశాం. ఆర్ఆర్ఆర్ లాంటి మధురమైన చిరస్మరణీయమైన చిత్రాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు. మ్యాన్ ఆఫ్ మాసెస్ మాస్ మేనియాతో వస్తున్న ఎన్టీఆర్ 30 కోసం వేచి ఉండలేకపోతున్నాము. తారక్ కు, కొరటాల శివకు, మూవీ యూనిట్ కు శుభాకాంక్షలు. 2024 ఏప్రిల్ 5న పట్టణానికి ఎరుపు రంగు వేద్దాం’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఎన్టీఆర్ పై ఏకంగా ఆకాశంలో బ్యానర్ కట్టి మరీ అభిమానాన్ని చాటుకున్న ఫ్యాన్స్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
Sky Level Air Plane Banner Celebrations By USA NTR Fans @NTRFans_USA 🔥🔥@tarak9999 #NTR30 pic.twitter.com/MZXLK0VHfv
— NTR cults 💥 (@yamadonga999) March 20, 2023