కర్ణాటక ప్రాంతానికి చెందిన భూతకోల, వరాహ దైవం బ్యాక్ డ్రాప్ లో మిస్టరీ థ్రిల్లర్ గా ఈ సినిమాను తెరకెక్కించాడు రిషబ్ శెట్టి. వరల్డ్ వైడ్ రూ. 400 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూల్ చేసి రికార్డు సెట్ చేసింది.
‘కాంతార‘ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా బాక్సాఫీస్ ని షేక్ చేశాడు నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి. కేజీఎఫ్, సలార్ ఫేమ్ హోంబలే ఫిలిమ్స్ వారు నిర్మించిన ఈ సినిమా.. వరల్డ్ వైడ్ రూ. 400 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూల్ చేసింది. మొదట కన్నడలో రిలీజైన ఈ సినిమా.. ఆ తర్వాత తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ భాషలలో రిలీజై సంచలన విజయాన్ని నమోదు చేసింది. కేవలం తెలుగులోనే ఈ సినిమా సుమారు రూ. 60 కోట్లకు పైగా వసూల్ చేయడం విశేషం. రిషబ్ శెట్టినే హీరోగా నటించి, తెరకెక్కించిన ఈ సినిమాతో సప్తమి గౌడ అనే కొత్త బ్యూటీ హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైంది.
ఇక కర్ణాటక ప్రాంతానికి చెందిన భూతకోల, వరాహ దైవం బ్యాక్ డ్రాప్ లో మిస్టరీ థ్రిల్లర్ గా ఈ సినిమాను రిషబ్ శెట్టి ప్రెసెంట్ చేశాడు. నటీనటుల పెర్ఫార్మన్స్ లతో పాటు వరాహరూపం సాంగ్, ముఖ్యంగా క్లైమాక్స్ సినిమాని బ్లాక్ బస్టర్ గా నిలిపాయి. ఫలితంగా 16 కోట్ల బడ్జెట్ తో రూపొందిన కాంతార.. ఊహించని విధంగా రూ. 400 కోట్లు వసూల్ చేసి రికార్డు సెట్ చేసింది. కాగా.. పాన్ ఇండియా స్థాయిలో సినిమా హిట్ అయ్యేసరికి కాంతారకి ఇప్పుడు ప్రీక్వెల్ గా ‘కాంతార 2’ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. కాంతార 2లో హీరో ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్, వాళ్ళ ఫాదర్ ఏమైపోయాడు? అనే అంశాలను చూపనున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. కాంతార 2ని ఇప్పుడు ఇంకా భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు. దీనికి పార్ట్ 2 కోసం ఇండియా వైడ్ ప్రేక్షకులు ఎదురు చుస్తూండటంతో రిషబ్ శెట్టి.. డిఫరెంట్ లాంగ్వేజెస్ నుండి యాక్టర్స్ ని ఎంపిక చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా కాంతార 2లో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రూటేలా నటించనున్నట్లు సమాచారం. ప్రెజెంట్ రిషబ్ శెట్టితో కలిసి ఊర్వశి పిక్ పెట్టి.. కాంతార 2 లోడింగ్ అని పోస్ట్ పెట్టింది. దీంతో అందరూ కాంతార 2లో ఊర్వశి ఉందని ఫిక్స్ అయిపోయారు. అదీగాక ఈ ఏడాది మెగాస్టార్ చిరు సరసన బాస్ పార్టీ సాంగ్ లో ఆడిపాడింది ఊర్వశి. కాంతార 2లో ఉందా లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. మరి కాంతార 2 గురించి మీ అంచనాలు ఎలా ఉన్నాయో కామెంట్స్ లో తెలపండి.