సాధారణంగా గాసిప్స్ లాంటి వాటికి నటీనటులు పెద్దగా స్పందించరు. కానీ మరీ శ్రుతిమించితే మాత్రం లీగల్ నోటీసులు పంపిస్తుంటారు. ఇప్పుడు ఓ వ్యక్తికి నటి ఊర్వశి రౌతేలా అలానే నోటీసులు పంపింది.
ఊర్వశి రౌతేలా.. ఈ బ్యూటీ గురించి ఆల్రెడీ చాలామందికి తెలుసు. బాలీవుడ్ చాలా సినిమాలు చేసిన ఈ భామ.. టీమిండియా క్రికెటర్ పంత్ వల్ల అప్పట్లో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయింది. ఈ ఏడాది సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ మూవీలోనూ స్పెషల్ సాంగ్ చేసి టాలీవుడ్ ఆడియెన్స్ కి పరిచయమైపోయింది. ప్రస్తుతం పలు సౌత్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఊర్వశి.. ఓ వ్యక్తికి లీగల్ నోటీసులు పంపడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది. ఇంతకీ ఏం జరిగింది? ఎవరా పర్సన్?
అసలు విషయానికొస్తే.. ‘వాల్తేరు వీరయ్య’ హిట్ వల్ల అందులో స్పెషల్ సాంగ్ చేసిన ఊర్వశి రౌతేలాకు సౌత్ లో మంచి మంచి ఛాన్సులు వస్తున్నాయి. ‘కాంతార 2’లో ఛాన్స్ కొట్టేసిన ఈ బ్యుటీ.. రిలీజ్ కు రెడీగా ఉన్న అఖిల్ ‘ఏజెంట్’లోనూ ఓ సాంగ్ చేసింది. అయితే ఈ పాట షూటింగ్ సందర్భంగా హీరో అఖిల్, ఊర్వశిని వేధించాడని, అతడు పరిణితి చెందని నటుడని, అతడితో పనిచేయడం కంఫర్ట్ గా లేదని ఆమె ఫీలవుతోందని సోషల్ మీడియాలో రివ్యూలు రాసే ఉమైర్ సంధు ట్వీట్ చేశాడు. ఇప్పుడు దీనిపై ఫుల్ ఫైర్ అయిన ఊర్వశి రౌతేలా.. సదరు ఉమైర్ సంధుకి లీగల్ నోటీసులు పంపింది.
ఈ నోటీసుల విషయాన్ని తన ఇన్ స్టాలో పోస్ట్ చేసిన నటి ఊర్వశి రౌతేలా.. ఉమైర్ సంధు పేరు ప్రస్తావించలేదు కానీ అతడి ట్వీట్ స్క్రీన్ షాట్ ఫొటో పెట్టింది. ఇప్పుడు ఇది కాస్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. మొన్నటివరకు మన సినిమాలకు రివ్యూలు రాసిన ఉమైర్ సంధు.. ఇప్పుడు నోటికొచ్చిన గాసిప్స్ అన్ని రాస్తున్నట్లు అనిపిస్తుంది. ఇందులో భాగంగానే ఊర్వశి అతడికి నోటీసులు పంపింది. ఇకనైనా అలాంటి గాసిప్స్ రాయడం ఆపుతాడా లేదా అనేది చూడాలి. మరి ఈ విషయమై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.