స్టార్ హీరోయిన్ ఊర్వశీ రౌటేలా గురించి తెలిసిందే. స్పెషల్ డ్యాన్స్ నంబర్స్‌తో ఎంతో మంది యూత్ ఆడియెన్స్‌ను తన ఫ్యాన్స్‌గా మలచుకున్నారు.
ఊర్వశీ రౌటేలా.. సినీ ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు. ఈ బాలీవుడ్ అందానికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. గ్లామర్‌తో పాటు మంచి యాక్టింగ్, అద్భుతమైన డ్యాన్సులతో ప్రేక్షకుల మనసుల్లో ఆమె చెరగని ముద్ర వేశారు. తెలుగు సినీ ప్రియులకు కూడా ఊర్వశి పరిచయమే. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’లో ‘బాస్ పార్టీ’ సాంగ్‌తో టాలీవుడ్ ఆడియెన్స్‌కు ఆమె దగ్గరయ్యారు. ఈ పాటలో తన అందం, స్టెప్పులతో అదరగొట్టారు ఊర్వశి. ఆ తర్వాత అక్కినేని అఖిల్ ‘ఏజెంట్’లోనూ ఆమె సందడి చేశారు. అలాంటి ఊర్వశి తాజాగా ఫ్రాన్స్‌లో జరుగుతున్న ప్రఖ్యాత కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొన్నారు. ఇందులో ఐశ్వర్యారాయ్‌తో సహా పలువురు బాలీవుడ్ తారలు తళుక్కున మెరిశారు. వారిలో ఊర్వశీ రౌటేలా కూడా ఉన్నారు. అయితే ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో ఆమె వేసుకున్న క్రోకోడైల్ నెక్లెస్ మీదే అందరి దృష్టి పడింది.
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఊర్వశీ రౌటేలా వైవిధ్యమైన డ్రెస్సులు, అందచందాలతో అభిమానులను ఆకట్టుకున్నారు. అయితే ఆమె వేసుకున్న నెక్లెస్ బాగా హైలైట్ అయింది. ఆ నెక్లెస్ ధర ఎంతై ఉంటుందా అని సోషల్ మీడియాలో నెటిజన్స్ తెగ చర్చిస్తున్నారు. దీంతో ఈ విషయంపై తాజాగా ఊర్వశి టీమ్ స్పందించింది. ఆ నెక్లెస్ ధరను టీమ్ వెల్లడించింది. ఊర్వశి ధరించిన నెక్లెస్ ఫేక్ కాదని.. దాని ధర రూ.276 కోట్ల వరకు ఉంటుందని తెలిపింది. అది ఆమె ఫ్యాషన్‌కు నిదర్శనం అని చెప్పుకొచ్చింది. అయితే దీని ధర విన్న నెటిజన్స్.. వామ్మో, ఒక నెక్లెస్‌కు ఇన్ని వందల కోట్లు పెట్టడం ఏంట్రా బాబు అని షాక్ అవుతున్నారు. అంత ఖరీదైన నెక్లెస్ కొనేందుకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయంటూ క్వశ్చన్ చేస్తున్నారు. ఇకపోతే, హీరోయిన్ ఊర్వశి రౌటేలా ప్రముఖ క్రికెటర్ రిషబ్ పంత్ రిలేషన్షిప్లో ఉన్నారంటూ చాన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే వీటిపై ఊర్వశి, పంత్ల్లో ఎవరూ ఇప్పటిదాకా క్లారిటీ ఇవ్వలేదు.