Urfi Javed: చిత్ర విచిత్రమైన డ్రెస్సింగ్ స్టైల్స్‌తో సోషల్ మీడియాను ఎప్పటికప్పుడు షేక్ చేస్తున్నారు బాలీవుడ్ నటి ఉర్ఫీ జావెద్. ఆమె తన డ్రెస్సింగ్ స్టైల్ కారణంగా కొన్ని తల నొప్పులు కూడా తెచ్చుకుంటున్నారు. నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్నారు. తాజాగా, ఉర్ఫీ జావెద్‌పై నెటిజన్లు ఓ రేంజ్‌లో ట్రోల్స్ మొదలుపెట్టారు. తీవ్ర స్థాయిలో ఆమెపై కామెంట్లు చేస్తున్నారు. ఆ ట్రోలింగ్స్ తట్టుకోలేక ఉర్ఫీ అల్లాడిపోతున్నారు. శుక్రవారం తనపై వస్తున్న ట్రోలింగ్స్‌పై ఆమె స్పందించారు. ట్రోలింగ్స్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్లను తన సోషల్‌మీడియా ఖాతాలో షేర్ చేశారు. ఆ స్క్రీన్ షాట్లలో.. ‘‘ సిద్ధు మూసే వాలెకు బదులు ఈమెను చంపాల్సింది’’.. ‘‘ సిద్ధు మూసే వాలెకు తగిలిన బుల్లెట్లు ఏవో.. అవి నీకు తగలాల్సింది’’.. ‘‘నువ్వు ఎప్పుడు ఛస్తావో చావు.. అప్పుడు కుక్కలు కూడా ఏడవవు’’ అంటూ కామెంట్లు చేశారు.
ఈ కామెంట్లపై ఆమె ఏమన్నారంటే.. ‘‘ గత కొన్ని రోజులనుంచి నాపై వస్తున్న కామెంట్లకు సంబంధించి కొన్నింటిని మాత్రమే నేను పోస్టు చేస్తున్నాను. నేను కాల్చి చంపబడాలని జనం కోరుకుంటున్నారు. మనం ఇలాంటి క్రూరమైన ప్రపంచంలో బతుకుతున్నాం. నేను ఒక్కటి మాత్రం స్పష్టంగా చెబుతున్నా.. మీరు నేను చావాలని చాలా గట్టిగా కోరుకోవాలి… ఎందుకో తెలుసా?.. నేను బతకడానికి ఇక్కడ ఉన్నాను’’ అని అన్నారు. కాగా, ఉర్ఫీ జావెద్ తన చిన్నతనంలో డెస్సింగ్ స్టైల్ కారణంగా ఆమె తీవ్ర అవమానాల పాలైనట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తన కుటుంబం కూడా తనను అవమానించిందని తెలిపారు.
ఆ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘‘ నాకు పదిహేనేళ్లు ఉన్నపుడు లక్నోలో ఉన్నాను. సగం భుజాల వరకు ఉండే టాప్‌ను వేసుకున్నాను. అది కూడా నేను సొంతంగా తయారు చేసుకున్నాను. అలాంటి టాప్‌లు లక్నోలు ఎవరూ వేసుకునేవారు కాదు. ఆ టాప్ వేసుకుని నేను ఫొటో దిగాను. దాన్ని నా ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశాను. ఎవరో ఆ ఫొటోను పోర్న్ సైట్లో అప్‌లోడ్ చేశారు. అప్పుడు నన్ను అందరూ తప్పుబట్టారు, అవమానించారు. నా కుటుంబం కూడా నన్ను తప్పుబట్టింది, అవమానించింది’’ అని పేర్కొంది. మరి, ఉర్ఫీ జావెద్‌పై నెటిజన్లు చేస్తున్న ట్రోల్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Jr NTR: చాలామంది స్టార్ హీరోలకు సాధ్యం కాలేదు. కానీ.. Jr. NTR ఆ రికార్డు కొట్టాడు!