బిగ్‌బాస్ బ్యూటీ ఉర్ఫీ జావేద్ గురించి వినే ఉంటారు. కురచ దుస్తులతో ఓవర్ ఎక్స్‌పోజింగ్ చేస్తూ నిత్యం సోషల్ మీడియాలో పాపులర్ అవుతుంటారు ఉర్ఫీ. విభిన్నమైన దుస్తులు ధరిస్తూ యూత్ ఆడియెన్స్‌లో క్రేజ్ తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఏదైనా అంటే తనకు నచ్చినట్లుగా ఉంటానంటూ బదులిస్తుంటారు. అలాంటి ఉర్ఫీ జావేద్‌కు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. వస్త్రధారణ విషయంలో శ్రుతిమించి తరచూ విమర్శలు ఎదుర్కొంటున్న ఈ అందాల భామకు ముంబైలో ఎవరూ అద్దెకు ఇవ్వడం లేదట. తనకు వచ్చే రాజకీయ బెదిరింపుల కారణంగానే ఎవరూ అద్దెకు ఇల్లు ఇవ్వడం లేదన్నారు ఉర్ఫీ. తన వస్త్రధారణ కారణంగా కూడా యజమానులు ఇంటిని అద్దెకు ఇచ్చేందుకు ఒప్పుకోవడం లేదని ఆమె వాపోయారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ఉర్ఫీ వెల్లడించారు. ముంబైలోని ముస్లిం ఇంటి యజమానులు తాను దుస్తులు ధరించే విధానం కారణంగా అద్దె ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారని ఆమె చెప్పుకొచ్చారు. తాను ముస్లిం కాబట్టి హిందూ యజమానులు అద్దెకు ఇల్లు ఇవ్వడం లేదన్నారు.
‘నాకు వచ్చే రాజకీయ బెదిరింపులతో కొంతమంది యజమానులకు పెద్ద సమస్యగా మారింది. దీంతో ముంబైలో అద్దెకు ఫ్లాట్ కనుగొనడం చాలా కష్టంగా ఉంది’ అని ఉర్ఫీ జావెద్ ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ‘నేనూ ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నా. మీకు త్వరగా మంచి ఇల్లు దొరకాలని కోరుకుంటున్నా’ అని ఓ నెటిజన్ రిప్లై ఇచ్చారు. దీనికి.. ‘ప్రతిసారీ ఇదే జరుగుతోంది. మ్యారేజ్ కాని ఓ నటికి ఇల్లు అద్దెకు దొరకడం అసాధ్యమే’ అంటూ ఉర్ఫీ బదులిచ్చారు. ఇకపోతే, హిందీలో ‘బడే భయ్యా కీ దుల్హనియా’, ‘యే రిష్తా క్యా కెహ్లాతా హే’ లాంటి టెలివిజన్ సీరియళ్లతో ఉర్ఫీ మంచి క్రేజ్ సంపాదించారు. సీరియల్స్‌లో యాక్ట్ చేస్తున్న సమయంలోనే ఆమెకు ప్రముఖ రియాల్టీ షో ‘బిగ్‌బాస్’లో పాల్గొనే చాన్స్ వచ్చింది. అలా, 2021లో ప్రసారమైన ‘బిగ్‌బాస్ ఓటీటీ’లో ఆమె కంటెస్టెంట్‌గా హిందీ బిగ్‌బాస్ షోలో పాల్గొన్నారు. మరి, ఉర్ఫీ జావెద్‌కు ముంబైలో అద్దెకు ఇల్లు దొరక్కపోవడం మీద మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#UrfiJaved reveals difficulties in finding a home on rent in Mumbai; ‘Single, Muslim, actress…’@uorfi_ https://t.co/p9mJBRfg7q
— ETimes TV (@ETimesTV) January 25, 2023