అమ్మాయిల ఫోటోలు కనబడితే చాలు కొందరు వెర్రెక్కిపోతారు. మార్ఫింగ్ చేసేసి వాటిని అశ్లీల వెబ్ సైట్స్ లో అప్ లోడ్ చేస్తుంటారు. కొందరు ఎలాంటి మార్ఫింగ్ లేకున్నా డైరెక్ట్ అప్లోడ్ చేస్తుంటారు. ఓ ప్రముఖ నటి విషయంలో కూడా ఇదే జరిగింది. ఆమె ఫోటోలు అశ్లీల వెబ్ సైట్ లో అప్లోడ్ చేయడంతో.. వాటిని తీసేయమని అడిగితే రూ. 50 లక్షలు డిమాండ్ చేశారు. రూ. 50 లక్షలు ఇస్తేనే ఫోటోలు తొలగిస్తాం అంటూ చెప్పారు.
ఫేస్ బుక్ లో అందరూ ఫోటోలు పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఆ ఫోటోలను కొందరు మార్ఫింగ్ చేసి పో*ర్న్ సైట్లలో పెడుతుంటారు. కొన్ని మార్ఫింగ్ చేయకుండా పెడుతుంటారు. అయితే అలాంటి వెబ్ సైట్లలో మన ఫోటోలు ఉన్నాయని తెలిస్తే ఎంత బాధగా ఉంటుంది చెప్పండి. ఒక నటికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. తన ఫోటోలను ఫేస్ బుక్ నుంచి డౌన్ లోడ్ చేసి పో*ర్న్ సైట్స్ లో అప్ లోడ్ చేశారు. అది ఈ నటి గురించి తెలిసిన వ్యక్తి చూసి దాన్ని ఇదిగో ఈ అమ్మాయే అంటూ ప్రచారం చేశాడు. దీంతో నేను అలాంటి దాన్ని కాదంటూ ఆ నటి కన్నీరు పెట్టుకుంది. ఆ సైట్ నుంచి ఫోటోలు తీయడానికి రూ. 50 లక్షలు కావాలని డిమాండ్ చేశారు సదరు వెబ్ సైట్ వాళ్ళు.
ఆ నటి మరెవరో కాదు, సోషల్ మీడియాతో బంతాట ఆడుకునే ఉర్ఫీ జావేద్. ఏదో ఒక స్టంట్ తో నిత్యం వార్తల్లో నిలిచే ఉర్ఫీ జావేద్ కి ప్రపంచంలో ఎవరికీ రానటువంటి అవడియాలు అన్నీ వస్తాయి. చిత్రవిచిత్రమైన బట్టలు వేసుకుని దానికి ఫ్యాషన్ అని ఒక లేబుల్ తగిలిస్తుంది. పిచ్చి కుక్కలు తరుముతాయేమో ఆ బట్టల్ని చూసి అని సోషల్ మీడియా జనం భయపడే పరిస్థితి. ఆమె చేష్టలకు సోషల్ మీడియాలో జనం విపరీతంగా ట్రోల్ చేస్తుంటారు. ఎవరేమీ అన్నా గానీ నువ్వు చేసే పనిలోనా నీతీ ఉంది, నిజాయితీ ఉంది అన్నట్టు పట్టించుకోకుండా తన పని తాను చూసుకుంటూ ఉంటుంది. అయితే అంత కేర్ లెస్ గా ఉన్నట్టు ఉండే ఈ ఉర్ఫీ జీవితంలో విషాదం కూడా ఉంది.
కన్న తండ్రే తనను మానసికంగా వేధించాడని, అశ్లీల సినిమాల్లో నటిస్తున్నానని తన తండ్రి భావించాడని ఆమె ఆరోపించింది. ఫేస్ బుక్ లో పెట్టిన ప్రొఫైల్ పిక్ ని ఎవరో పో*ర్న్ వెబ్ సైట్ లో పెడితే నిజంగానే తనను అందరూ ఒక పో*ర్న్ స్టార్ గా చూశారని.. వాళ్లలో తనను కన్న తండ్రి కూడా ఉన్నాడని వెల్లడించింది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది. అప్పుడు తన వయసు 15 ఏళ్ళు అని.. తన ఫోటోను ఫేస్ బుక్ లోంచి డౌన్ లోడ్ చేసి అశ్లీల వెబ్ సైట్ లో అప్ లోడ్ చేశారని అన్నారు. దాన్ని చూసిన ఒక వ్యక్తి తన ఫోటో పో*ర్న్ సైట్ లో వచ్చిందని ప్రచారం చేయడం మొదలుపెట్టారని ఆమె బాధపడింది. తననొక పో*ర్న్ స్టార్ అని అన్నారని.. ఆ సమయంలో మానసిక వేదన అనుభవించానని వెల్లడించింది.
ఆ సమయంలో తన తండ్రి కూడా పో*ర్న్ స్టార్ అంటూ నిందించాడని.. ఇతరుల దగ్గర సానుభూతి పొందడానికి తనను ఇష్టమొచ్చినట్లు కొట్టాడని చెప్పుకొచ్చింది. పో*ర్న్ సైట్ నుంచి ఫోటో తీసేయడానికి ఆ వెబ్ సైట్ వాళ్ళు రూ. 50 లక్షలు అడుగుతున్నారని తన తండ్రి బంధువుల దగ్గర చెప్పి పరువు తీసేవాడని ఆమె బాధపడింది. ఈ నిందలు, అవమానాలు తట్టుకోలేక 17 ఏళ్ల వయసులో ఇంట్లో నుంచు బయటకు వచ్చేశానని ఆమె వెల్లడించింది. ఢిల్లీకి వెళ్లిన ఆమె అక్కడ ట్యూషన్లు చెప్పింది. కాల్ సెంటర్లో పని చేసింది. ఆ తర్వాత ముంబై వెళ్ళింది. స్నేహితుల ఇళ్లలో ఉంటూ ఆడిషన్స్ కి వెళ్ళేది. అలా కొన్నాళ్ళు స్ట్రగుల్ ఫేస్ చేసిన తర్వాత టీవీ సీరియల్ లో నటించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత బిగ్ బాస్ ఓటీటీలో అవకాశం వచ్చిందని ఆమె వెల్లడించింది. మరి ఎవరో చేసిన తప్పుకి ఉర్ఫీ జావేద్ ను కన్న తండ్రి నిందించడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.