ప్రముఖ నటి ఉర్ఫీ జావెద్ మరోసారి రెచ్చిపోయారు. ఎప్పటిలా కాకుండా ఈ సారి కొత్త పద్దతిలో అందాల ఆరబోతకు తెరతీశారు. రెండు వైన్ గ్లాసులు అడ్డుగా తన అందాల్ని దాస్తూ కుర్రకారుకు చెమటలు పట్టిస్తున్నారు. ఉర్ఫీ జావెద్ నిన్న ఓ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఆ వీడియోలో విచిత్రమైన హెయిర్ స్టైల్, తీక్షణమైన చూపుతో.. ఆమె ఒంటిపై ఒక్క నూలు పోగు కూడా లేకుండా ఉన్నారు. తన అందాలకు అడ్డుగా ఓ రెండు తెల్ల వైన్ గ్లాసులను ఉంచుకున్నారు. కొద్దిసేపటి తర్వాత వాటిని పట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తోంది. వైరల్‌గా మారటంతో మంచి వ్యూస్‌తో పాటు కామెంట్లు కూడా వస్తున్నాయి. ఉర్ఫీ జావెద్ కొత్త లుక్‌పై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ ఛీ.. ఈమె ఎప్పటికి మారుతుందో’’..
‘‘ రోజు రోజుకు ఈమె విచిత్రమైన లుక్‌లను చూడలేక ఛస్తున్నాం’’.. ‘‘ ఎందుకు ఎక్కువ మంది ఉర్ఫీ జావెద్‌ను అసహ్యించుకుంటున్నారో నాకు అర్థం కావటం లేదు. నిజంగా ఆమెంటే నాకు చాలా ఇష్టం. ఆమె ధైర్యానికి హాట్సాప్’’ అంటూ ఉన్నారు. కాగా, నెల రోజుల క్రితం బిగ్‌బాస్ కంటెస్టెంట్ హిందుస్తానీ భయు ఉర్ఫీ జావెద్‌కు వార్నింగ్ ఇచ్చాడు. సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను విడుదల చేశాడు. ‘‘నువ్వు మారు. లేకపోతే నేనే నిన్ను మారేలా చేస్తా’’ అని అన్నాడు. దీనిపై ఆమె స్పందిస్తూ తన దైన శైలిలో సెటైర్లు వేసింది. గతంలో ఆమెపై కొంతమంది నెటిజన్లు చాలా దారుణంగా ట్రోలింగ్స్ చేశారు. ఆ ట్రోలింగ్స్ తట్టుకోలేక ఉర్ఫీ అల్లాడిపోయారు. తనపై వచ్చిన ట్రోలింగ్స్‌పై ఆమె స్పందించారు.
ట్రోలింగ్స్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్లను తన సోషల్‌మీడియా ఖాతాలో షేర్ చేశారు. ఆ స్క్రీన్ షాట్లలో.. ‘‘ సిద్ధు మూసే వాలెకు బదులు ఈమెను చంపాల్సింది’’.. ‘‘ సిద్ధు మూసే వాలెకు తగిలిన బుల్లెట్లు ఏవో.. అవి నీకు తగలాల్సింది’’.. ‘‘నువ్వు ఎప్పుడు ఛస్తావో చావు.. అప్పుడు కుక్కలు కూడా ఏడవవు’’ నెటిజన్లు అంటూ కామెంట్లు చేశారు. వీటిపై ఉర్ఫీ.. ‘‘ గత కొన్ని రోజులనుంచి నాపై వస్తున్న కామెంట్లకు సంబంధించి కొన్నింటిని మాత్రమే నేను పోస్టు చేస్తున్నాను. నేను కాల్చి చంపబడాలని జనం కోరుకుంటున్నారు. మీరు నేను చావాలని చాలా గట్టిగా కోరుకోవాలి… ఎందుకో తెలుసా?.. నేను బతకడానికి ఇక్కడ ఉన్నాను’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.