బాలీవుడ్, సోషల్ మీడియాలో ఉర్ఫీ జావెద్ అంటే తెలియని వాళ్లు ఉండరేమే. నిత్యం సోషల్ మీడియాలో బోల్డ్ ఫొటోలు పెడుతూ ప్రేక్షకులను ఉడికిస్తూ ఉంటుంది. ఆమె వివాదాస్పద వ్యాఖ్యలతోనూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇటీవలే ఆరోగ్యం బాలేదని ఆస్పత్రిలో కూడా చేరింది. డిశ్చార్జ్ అయిన తర్వాత మళ్లీ పోస్టుల్లో జోరు పెంచింది. ఎప్పుడూ చలాకీగా పోస్టులు చేసే ఉర్ఫీ జావెద్ ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది.
తనకు ఓ వ్యక్తి నుంచి వేధింపులు వస్తున్న విషయాన్ని ఇన్ స్టాగ్రామ్ వేదికగా బయటపెట్టింది. పంజాబ్ ఇండస్ట్రీకి చెందిన ఓ వ్యక్తి తనకు వీడియోకాల్ చేయాలంటూ చాలా కాలంగా వేధిస్తున్నట్లు తెలిపింది. అతను చేసిన చాటింగ్ వివరాలను కూడా బట్టబయలు చేసింది. తన కోరిక తీర్చాలంటూ అతను వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆధారాలు చూపించింది. అంతేకాకుండా వీడియోకాల్ చేయాలంటూ అతను కోరడం ఆ స్క్రీన్ షాట్లలో ఉంది.
వెంటనే వీడియోకాల్ చేసి తన కోరిక తీర్చాలంటూ అతను బెదిరంపులకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని చెప్తూ ఉర్ఫీ జావెద్ ఎమోషనల్ అయ్యింది. రేండేళ్ల క్రితం తన ఫొటో ఒకటి మార్ఫింగ్ చేసి ఓ వీడియో క్రియేట్ చేసినట్లు ఉర్ఫీ వెల్లడించింది. ఆ వీడియోకి సంబంధించి ఆమె అప్పుడే ఫిర్యాదు కూడా చేసినట్లు తెలిపింది. అప్పటి ఫొటోని అడ్డుపెట్టుకుని అతను వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆమె ఆరోపించింది.
14 రోజుల క్రితం అతనిపై ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. అన్నీ విషయాల్లో ముంబై పోలీసులు ఎంతో ముందుంటారని. చాలా సందర్భాల్లో వాళ్లని చూసి గర్వపడినట్లు ఉర్ఫీ తెలిపింది. కానీ, ఇతని విషయంలో పోలీసులు ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యంగా ఉందంటూ చెప్పింది. అతను సమాజంలో తిరిగితే మహిళలకు రక్షణ ఉండదంటూ వాపోయింది. వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఉర్ఫీ జావెద్‌కు ఎదురైన అనుభవంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.