Urfi Javed: నిత్యం వార్తల్లో నిలిచే నటీమణుల్లో ఉర్ఫీ జావెద్ ఒకరు. అరకొర డ్రెస్సింగ్ స్టైల్తో సోషల్ మీడియాలో ఎప్పుడూ విమర్శలు ఎదుర్కొంటూ ఉంటారామె. తాజాగా, ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఫొటోలపై నెటిజన్లు తీవ్ర పదజాలంతో కామెంట్లు చేశారు. నాకివేమీ కొత్త కాదు అన్నట్లుగా ఉర్ఫీ జావెద్ స్పందించలేదు. అయితే, గతంలో ఇలాంటి డెస్సింగ్ స్టైల్ కారణంగానే ఆమె తీవ్ర అవమానాల పాలైనట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తన కుటుంబం కూడా అవమానించిందని తెలిపారు. ఆ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘‘ నాకు పదిహేనేళ్లు ఉన్నపుడు లక్నోలో ఉన్నాను. సగం భుజాల వరకు ఉండే టాప్‌ను వేసుకున్నాను. అది కూడా నేను సొంతంగా తయారు చేసుకున్నాను. అలాంటి టాప్‌లు లక్నోలు ఎవరూ వేసుకునేవారు కాదు. ఆ టాప్ వేసుకుని నేను ఫొటో దిగాను. దాన్ని నా ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశాను.
ఎవరో ఆ ఫొటోను పోర్న్ సైట్లో అప్‌లోడ్ చేశారు. అప్పుడు నన్ను అందరూ తప్పుబట్టారు, అవమానించారు. నా కుటుంబం కూడా నన్ను తప్పుబట్టింది, అవమానించింది’’ అని పేర్కొంది. అయితే, ఈ విషయం తెలిసిన తర్వాత కొందరు నెటిజన్లు ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంత జరిగినా బుద్ధి రాలేదంటూ మండిపడుతున్నారు. అరకొర డ్రస్సులతో ఎందుకు టార్చర్ పెడుతున్నావంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి, ఉర్ఫీ జావెద్ డ్రెస్సెంగ్ స్టైల్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : లేటు వయసులో భూమిక ఘాటు అందాలు.. పిక్ వైరల్!