Prashanth Neel: కేజీఎఫ్ సినిమాతో ప్యాన్ ఇండియా దర్శకుడిగా మారారు ‘‘ప్రశాంత్ నీల్’’. ఈ సినిమా భారీ విజయం అందుకోవటంతో ఆయన స్థాయి అమాంతం పెరిగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ప్రశాంత్ నీల్ పేరు మారుమోగుతోంది. దర్శకుడిగా ప్రశాంత్ ఎంతో మందికి స్పూర్తిగా నిలిచారు. చాలా మంది ఆయన్ని ఆరాధించటం మొదలుపెట్టారు. వారిలో ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సాన ఒకరు. తాజాగా, బుచ్చిబాబు సాన ప్రశాంత్ నీల్‌ను కలిశారు. ఈ విషయాన్ని తన ట్విటర్ ఖాతా ద్వారా పంచుకున్నారు.‘‘ నా రీసెంట్ ఇన్‌స్పిరేషన్ ప్రశాంత్ నీల్ సార్.. మిమ్మల్ని కలవటం ఎంతో ఆనందంగా ఉంది. మీతో మాట్లాడటం సంతోషానిచ్చింది’’ అని పేర్కొన్నారు.
ఈ ఇద్దరు డైరెక్టర్లు జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమాలు తీయబోతున్నారన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ 31వ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తుండగా.. 32వ సినిమాకు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరు కలిసున్న ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. మరి, ఎన్టీఆర్ డైరెక్టర్ల అపూర్వ కలయికపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
My recent inspiration @prashanth_neel sir…
Very nice meeting you 💓🤗 Had a delightful conversation. pic.twitter.com/Fhz19OXpoh— BuchiBabuSana (@BuchiBabuSana) May 5, 2022
#NTR31 & #NTR32 pic.twitter.com/aZQMvBaa9v
— Aakashavaani (@TheAakashavaani) May 5, 2022
ఇవి కూడా చదవండి : Ram Gopal Varma : KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ని వీరప్పన్ తో పోలుస్తూ RGV వ్యాఖ్యలు!