దక్షిణాది విలక్షణ నటులలో ఉపేంద్ర ఒకరు. ఒక నటుడిగానే కాకుండా సినీ ఇండస్ట్రీలో దర్శకుడిగా, రచయితగా కూడా సక్సెస్ అయ్యాడు. మొదట దర్శకుడిగా కన్నడ ఇండస్ట్రీలో కెరీర్ ప్రారంభించిన ఉపేంద్ర.. ఆ తర్వాత నటుడిగా స్టార్డమ్ అందుకొని.. తెలుగులో కూడా చాలా సినిమాలు చేశాడు. అయితే.. నటుడిగా మారాక డైరెక్షన్ మాత్రం వదలలేదు. ఫస్ట్ నుండి కూడా ఉపేంద్ర సినిమాలకు సౌత్ లోని అన్ని భాషల్లో మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడింది.
ఇక ప్రస్తుత పాన్ ఇండియా సినిమాల కాలంలో ఉపేంద్ర కూడా పాన్ ఇండియా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ఉపేంద్ర ప్రధాన పాత్రలో కబ్జా అనే పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతోంది. ఆ సినిమా చిత్రీకరణ దశలో ఉండగానే ఉపేంద్ర నుండి మరో పాన్ ఇండియా మూవీ ప్రకటన బయటికి వచ్చింది. ఇంకా టైటిల్ ఖరారు కాని కొత్త సినిమా పోస్టర్ సినీవర్గాలలో హాట్ టాపిక్ గా మారింది.ఇండస్ట్రీలో ఉపేంద్ర సినిమాలకు ప్రత్యేకమైన స్థానం ఏర్పడింది. ఆయన ఏ సినిమా చేసినా ఖచ్చితంగా ఏదొక డిఫెరెంట్ కాన్సెప్ట్ ఉంటుంది. అందుకే మరో విలక్షణమైన సినిమాతో దర్శకుడిగా రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఉపేంద్ర చివరిగా ‘ఉప్పి 2’ సినిమా డైరెక్ట్ చేసాడు. ఆ తర్వాత కేవలం నటన పైనే ఫోకస్ పెడుతూ వచ్చాడు. కెరీర్ మొదటినుండి ఉపేంద్రతో మంచి అనుబంధం కలిగిన ‘లహరి మ్యూజిక్’ వారు నిర్మాణంలోకి దిగి పాన్ ఇండియా మూవీ అనౌన్స్ చేశారు.
సౌత్ ఇండియాలోని టాప్ మ్యూజిక్ లేబుల్స్ లో ఒకటైన లహరి మ్యూజిక్.. “లహరి ఫిల్మ్స్ LLP” బ్యానర్ ద్వారా ప్రొడక్షన్ లో అడుగుపెడుతోంది. ఉపేంద్రనే హీరోగా దర్శకుడిగా తెరకెక్కనున్న ఈ సినిమా.. కన్నడతో పాటు హిందీ, తెలుగు, తమిళం భాషలలో రిలీజ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఇతర వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ఇక తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ ఆద్యంతం ఆసక్తి రేపుతోంది.
In the film Industry, it is you who created the story Upendra, it is you who wrote the screenplay & dialogues for 33 years, it is you who directed through your whistles and claps. I dedicate this film to you the praja prabhu fans 🙏🙏🙏#nimmaupendra #uppidirects #laharifilms pic.twitter.com/h4UsatujyT
— Upendra (@nimmaupendra) March 11, 2022
ఈ పోస్టర్ చూస్తుంటే ఉపేంద్ర లుక్.. గేదె కొమ్ములు కలిగిన గుర్రంపై కూర్చొన్న టెర్రిఫిక్ లుక్ సినిమా పై అంచనాలు పెంచుతోంది. ఉపేంద్ర నటిస్తూ తెరకెక్కించనున్న మొదటి పాన్ ఇండియా మూవీ ఇదే కావడం విశేషం. ఇదిలా ఉండగా.. ఏప్రిల్ 1న ఉపేంద్ర నటించిన హోమ్ మినిస్టర్ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. మరోవైపు కిచ్చా సుదీప్ కాంబినేషన్ లో కబ్జా సిద్ధం అవుతోంది. మరి ఉపేంద్ర కొత్త సినిమా లుక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.