మెగా కోడలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య కొణిదెల ఉపాసన పరిచయం అక్కర్లేని పేరు. ఉపాసనలో ఉన్న సామాజిక సేవా దృక్పథం గురించి అందరికి తెలిసిందే. పలు రకాల సేవ కార్యక్రమాలు చేస్తూ మామకు తగ్గకోడలు అనిపించుకుంటున్నారు. సోషల్ మీడియాలో సైతం ఆమె చాలా యాక్టీవ్ గా ఉంటారు. తనకు సంబంధించిన విషయాలను మెగా అభిమానులతో షేర్ చేసుకుంటారు. అంతేకాక ఏదైన విషయంలో తనవైపు నుంచి పొరపాటు జరిగితే క్షమాపణలు కోరుతూ ఉపాసన ఎంతో హుందాగా ప్రవర్తిసారు. ఇప్పటికే ఉపాసన ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని తెలియజేసే అనేక ఘటనలను చూశాం. తాజాగా ఉపాసన.. ఓ స్టార్ హీరోయిన్ కి క్షమాపణలు చెప్పింది. మరి.. ఆ స్టార్ హీరోయిన్ ఎవరు? ఆమెకు ఉపాసన సారీ చెప్పాల్సినంత తప్పు ఏం చేశారు? ఆ విషయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
బాలీవుడ్ ప్రేమ పక్షులు కియారా అద్వానీ, సిద్దార్థ్ మల్హోత్రా వివాహబంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. వేదమంత్రాలు, అగ్ని సాక్షిగా ఏడడుగులు నడిచి.. ఈ ప్రేమజంట దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టారు. ఫిబ్రవరి 7న కియారా అద్వానీ, సిద్దార్థ్ మల్హోత్రల వివాహం జరిగింది. తమ ప్రేమపాఠాలకు ముగింపు పలికి.. వైవాహిక బంధంలోకి అడుగు పెట్టారు. వీరి పెళ్లికి బాలీవుడ్ చెందిన సినీ తారలు హాజరై..నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. అలానే టాలీవుడ్ సెలబ్రిటీలకు సైతం వీరి వివాహా ఆహ్వాన లేఖలు అందాయి. అలా లేఖలు అందిన వారిలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన జంట కూడా ఉంది. అయితే కొన్ని కారణాల రీత్య రామ్ చరణ్ దంపతులు ఈ పెళ్లికి హాజరు కాలేకపోయారు. తాజాగా తాము రాకపోవడంపై మెగా కోడలు ఉపాసన సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
కియారా అద్వానీ.. తమ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోలపై ఉపాసన స్పందిస్తూ… వారికి శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాక పెళ్లికి హాజరు కానందుకు సారీ కూడా చెప్పారు. ” ఇద్దరూ చూడముచ్చటగా ఉన్నారు. మేము మీ పెళ్లి వేడుకకు హాజరు కాలేకపోయినందుకు సారీ” అంటూ కామెంట్స్ చేశారు. అంతేకాక సమంత, ఆలియాభట్, కత్రినా కైప్, వరుణ్ ధావన్, విక్కీ కౌశల్, అనిల్ కపూర్, అనుపమ పరమేశ్వరన్ తో సహా పలువురు సినీ తారలు.. ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు చేశారు. మరి.. కియరా అద్వానీకి ఉపాసన సారీ చెప్పడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి