మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. రామ్ చరణ్ భార్యగానే కాక.. ఈమె అపోలో హాస్పిటల్ చైర్ పర్సన్ గా విధులు నిర్వహించడమే కాకుండా, ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటూ మంచి గుర్తింపు పొందారు. ఇక రామ్ చరణ్-ఉపాసనల వివాహం జరిగి.. ఈ ఏడాదితో 10 ఏళ్లు పూర్తయ్యాయి. అయినా ఇప్పటి వరకు వీరికి పిల్లలు కలగలేదు. ఇక మెగా వారసుడి కోసం వారి కుటుంబ సభ్యులతో పాటు.. అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇక సోషల్ మీడియా, పలు ఇంటర్వ్యూలలో ఉపాసనకు పిల్లలకు సంబంధించిన ప్రశ్నే ఎదురవుతుంది. కానీ ఉపాసన మాత్రం ఇది పూర్తిగా తమ వ్యక్తిగత విషయం అంటూ సమాధానం దాటవేస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఉపాసన.. పిల్లల విషయం గురించి సద్గురుతో జరిపిన సంభాషణ వైరల్‌గా మారింది.
అయితే కొందరు సద్గురు-ఉపాసనల మధ్య జరిగిన సంభాషణను తప్పుగా అర్థం చేసుకుని.. అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారట. నాడు ఉపాసనతో జరిగిన సంభాషణలో సద్గురు పిల్లల్ని కనని వారికి నేను బహుమతి ఇస్తాను. ఇప్పటికే దేశ జనాభా విపరీతంగా పెరిగిపోతుంది. పిల్లల్ని వద్దనుకునే వారికి గిఫ్ట్ ఇస్తాను అన్నాడు. అందుకు ఉపాసన.. అయితే నేను మీకు అలాంటి అవకాశం ఇవ్వను అని చెప్పింది. అంటే ఇన్‌డైరెక్ట్‌గా తాము తప్పకుండా పిల్లల్ని కంటామని వెల్లడించింది.
ఇది కూడా చదవండి: పిల్లల్ని కనడంపై సద్గురుకు ఉపాసన ప్రశ్న! వీడియో వైరల్!
అయితే కొందరు ఉపాసన ఇంటర్వ్యూని పూర్తిగా వినకుండా.. జనాభా నియంత్రణ కోసమే రామ్ చరణ్ దంపతులు పిల్లల్ని కనకూడదని నిర్ణయం తీసుకున్నారంటూ వార్తలు ప్రచారం చేస్తున్నారట. అవి కాస్త ఉపాసన దృష్టికి చేరడంతో ఆమె ఈ వార్తలపై స్పందించారు. ‘‘మీరు వీడియో మొత్తం చూడకుండా ఇలాంటి వార్తలు ప్రచారం చేయడం సరికాదు.. మేం పిల్లల్ని వద్దనుకున్నామంటూ వస్తున్న వార్తలు నిజం కాదు.. దయచేసి వీడియో.. నా కాపీ పూర్తిగా విని, చదవండి’’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్‌లో పోస్ట్ చేశారు ఉపాసన. ప్రస్తుతం మెగా కోడలి పోస్ట్ వైరల్‌గా మారింది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Upasana Konidela: తన రేంజ్ కి తగ్గ కారు కొన్న మెగా కోడలు ఉపాసన.. ధర ఎంతంటే?