ప్రెగ్రెన్సీతో ఉన్న ఉపాసనకు బేబీ షవర్ వేడుక నిర్వహించారు. దుబాయిలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన వీడియోని తాజాగా ఆమె తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.
మెగాఫ్యామిలీకి ఈ ఏడాది భలే కలిసొస్తున్నట్లు కనిపిస్తుంది. రామ్ చరణ్ భార్య ఉపాసన ప్రెగ్నెన్సీ ఉందని గతేడాది డిసెంబరులో ప్రకటించారు. ఇది జరిగిన కొన్ని రోజులకు అంటే.. సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’గా వచ్చి సూపర్ హిట్ కొట్టారు. కొన్నాళ్ల ముందు చరణ్ హీరోగా నటించిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీకి ఆస్కార్ వచ్చింది. ఇలా వరసగా అన్నీ హ్యాపీ న్యూస్ లే వినిపిస్తున్నాయి. తాజాగా ఉపాసన బేబీ షవర్ వేడుక సందడి చేసుకున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఓ వీడియోని ఇన్ స్టాలో ఆమె షేర్ చేయగా, నెటిజన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మొన్నటివరకు సాధారణ హీరో. నటుడిగా హిట్స్, ఫ్లాప్స్ అందుకున్నాడు. ఇప్పుడు మాత్రం గ్లోబల్ స్టార్ అయిపోయాడు. 2012లో ఉపాసనని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈ జంట పిల్లల గురించి ఆలోచించలేదు. దీనిపై రకరకాల కామెంట్స్ వినిపించాయి. ఇప్పుడు వాటన్నింటికి పుల్ స్టాప్ పెట్టేశారు. త్వరలో ఉపాసన తొలి బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ క్రమంలోనే దుబాయిలో వేడుకగా బేబీ షవర్ నిర్వహించారు. దీన్ని ఉపాసన సిస్టర్స్ ఆర్గనైజ్ చేశారు. ఈ విషయాన్ని ప్రస్తావించిన ఉపాసన.. వాళ్లకు థ్యాంక్స్ చెప్పింది.
‘మీ అందరి ప్రేమకు థ్యాంక్యూ. నా లైఫ్ లో బెస్ట్ బేబీ షవర్ ఇచ్చిన నా డార్లింగ్ సిస్టర్స్ కు థ్యాంక్స్’ అని ఉపాసన ఓ వీడియో పోస్ట్ చేశారు. ఈ వేడుకలో చరణ్-ఉపాసన దంపతులతోపాటు ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ చాలామంది పాల్గొన్నారు. దుబాయిలోని నమ్మోచ్ బీచ్ క్లబ్ లో ఈ బేబీ షవర్ గ్రాండ్ గా నిర్వహించారు. ఇదిలా ఉండగా చరణ్ ప్రస్తుతం శంకర్ తీస్తున్న ‘గేమ్ ఛేంజర్’లో నటిస్తున్నారు. దీని తర్వాత బుచ్చిబాబు దర్శకత్వలో యాక్ట్ చేస్తారు. ఇలా తన మూవీస్ లైనప్ గా గట్టిగా ప్లాన్ చేసుకున్నారు. సరే ఇదంతా పక్కనబెడితే ఉపాసన బేబీ షవర్ వీడియో చూడగానే మీకేం అనిపించింది. కింద కామెంట్ చేయండి.