తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఓటిటి ఆహా. రెగ్యులర్‌గా సినిమాలు, వెబ్ సిరీస్‌లతో పాటు వినూత్నమైన సెలబ్రిటీ టాక్ షోస్ సైతం అందిస్తోంది. అయితే.. ఆహా ఓటిటికి సాలిడ్ రెస్పాన్స్, పేరు తెచ్చిన టాక్ షో ‘అన్‌స్టాపబుల్’ అని నిర్మొహమాటంగా చెప్పవచ్చు. నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా ప్రారంభించిన ఈ టాక్ షో.. ఇండియాలో ది బెస్ట్ షోలలో ఒకటిగా నిలిచి.. పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకుంది. ఇప్పటిదాకా టాలీవుడ్ కి సంబంధించి ఎందరో స్టార్ హీరోలు, హీరోయిన్స్, ఇతర సెలబ్రిటీలంతా ఈ షోలో పాల్గొన్నారు. అన్ని ఎపిసోడ్స్‌కి మించి సూపర్ స్టార్ మహేష్ బాబు, డార్లింగ్ ప్రభాస్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్స్ భీభత్సమైన రెస్పాన్స్ దక్కించుకున్నాయి.
ప్రస్తుతం సాలిడ్ క్రేజ్ తో అన్ స్టాపబుల్ షో దూసుకుపోతుంది. తాజాగా పవన్ కళ్యాణ్ నుండి మొదటి ఎపిసోడ్ ఒకటే స్ట్రీమింగ్ అయ్యింది. దీంతో అన్ స్టాపబుల్‌లో స్ట్రీమింగ్ అయిన మహేష్ బాబు, ప్రభాస్, పవన్ కళ్యాణ్ ఎపిసోడ్స్ లో ఏది బాగా నచ్చిందనే చర్చలు మొదలయ్యాయి. బాలయ్య షో అంటే ఎంత సందడి ఉంటుందో తెలిసిందే. అలాంటిది స్టార్ హీరోలతో బాలయ్య మాటామంతి అంటే ఏ స్థాయిలో ఎంటర్టైన్ మెంట్ లభిస్తుందో ఆలోచించండి. మొదటి సీజన్ ఎండింగ్‌ని సూపర్ స్టార్ మహేష్ ఎపిసోడ్ తో ముగించిన అన్‌స్టాపబుల్ టీమ్.. ఈసారి రెండో సీజన్ ని ప్రభాస్, పవన్ కళ్యాణ్ ఎపిసోడ్స్ తో ఎండ్ చేస్తున్నారు.
ఇక అన్‌స్టాపబుల్ లో ఏ హీరో పాల్గొన్నా బాలయ్య ట్రీట్ మెంట్ ఎలా ఉంటుందో అందరూ చూశారు. సినిమాలలో ఉగ్రరూపం దాల్చినా.. టాక్ షోలో నెం. 1 అనిపించాడు బాలయ్య. అయితే.. మొదటి సీజన్ లో పాల్గొన్న మహేష్.. రెండో సీజన్ లో పాల్గొన్న ప్రభాస్, పవన్ కళ్యాణ్.. ఈ ముగ్గురి ఎపిసోడ్స్ జనాలకు విపరీతంగా నచ్చేశాయి. ఏ ఒక్కరూ తక్కువ కాదు. వారి వారి క్రేజ్, ఫ్యాన్ బేస్ బట్టి, టెక్నికల్ గా సమస్యలు వచ్చి ఉండొచ్చు గానీ ముగ్గురి ఎపిసోడ్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ముందుగా మహేష్ బాబు ఎపిసోడ్ గురించి మాట్లాడితే.. 45-50 నిమిషాలలో ఒకే ఎపిసోడ్ తో స్ట్రీమింగ్ చేశారు. బాలయ్యతో మహేష్ ఎపిసోడ్స్ కి బాగా కనెక్ట్ అయిపోయిన జనం.. ఎపిసోడ్ ని సీజన్ టాపర్ గా నిలిపారు.
అదీగాక మహేష్ ఎపిసోడ్ ని కరెక్ట్ గా ఫెస్టివల్ టైమ్ లో ప్లాన్ చేసి ఫ్యాన్స్ మనసు గెలుచుకుంది ఆహా. ఆ తర్వాత సెకండ్ సీజన్‌లో కూడా చాలామంది హీరోలు వచ్చినప్పటికీ.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వస్తున్నాడని తెలిసి, దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ అలర్ట్ అయిపోయారు. సరిగ్గా ఎపిసోడ్ స్ట్రీమింగ్ సమయానికి ఆహా సర్వర్ క్రాష్ అయిపోయింది. పైగా ప్రభాస్ ఎపిసోడ్ కి పైరసి ప్రాబ్లెమ్ కూడా ఎదురవ్వడం జరిగింది. ప్రభాస్‌తో అన్ స్టాపబుల్ ని రెండు ఎపిసోడ్స్‌గా స్ట్రీమింగ్ చేశారు. ఆహాలో రెండు ఎపిసోడ్ల ట్రెండ్ ప్రభాస్ తో మొదలవ్వడం విశేషం. ప్రభాస్ ఎపిసోడ్స్ యావరేజ్ గా 50, 50 నిమిషాల నిడివిలో ప్రసారమయ్యాయి. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి.
ఇదిలా ఉండగా.. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ వచ్చేసరికి.. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ వస్తున్నాడని తెలిసి ఫ్యాన్స్ హంగామా మాములుగా చేయలేదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ని చెప్పిన టైంకి రిలీజ్ చేయకపోవడమే డ్రాబ్యాక్ గా చెప్పుకోవాలి. పవర్ స్టార్ అనగానే బాలయ్య ఎలాంటి మేజిక్ చేస్తాడో చూద్దామని ఫ్యాన్స్ భావించారు. ఎపిసోడ్ లో మ్యాటర్ ఉన్నప్పటికీ. నిర్వాహకులు కట్ చేసిన ప్రోమోల దృష్ట్యా, చెప్పిన టైమ్ కి కాకుండా వాయిదా వేయడంపై కామెంట్స్ వినిపించాయి. ఆ తర్వాత పూర్తి ఎపిసోడ్ వచ్చాక ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. అభిమాన హీరోలను సినిమాలలో కాకుండా టీవీ షోలలో చూడటం ఎంతో సరదాగా ఉంటుంది ఫ్యాన్స్ కి. మొత్తానికి ముగ్గురు హీరోల ఎపిసోడ్స్ ని చాలా హెల్తీ వాతావరణంలో రిలీజ్ చేసి ఫ్యాన్స్ మధ్య పరస్పర పాజిటివ్ వైబ్ సెట్ చేసింది ఆహా. అయినా ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ ప్రకారం మహేష్, ప్రభాస్, పవన్ ఎపిసోడ్స్ సూపర్ హిట్ అయ్యాయి. సో.. ఈ ముగ్గురి ఎపిసోడ్స్ లో పర్సనల్‌గా మీకు ఎవరి ఎపిసోడ్ బాగా నచ్చిందో కామెంట్స్ లో తెలియజేయండి.