నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటీటీ వేదికగా అన్ స్టాపబుల్ అనే టాక్ షో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఆహాలో స్ట్రీమ్ అయిన అన్ని ఎంటర్టైన్నెంట్ షోలలో కెల్లా బాలయ్య టాక్ షో “నెంబర్ వన్” టీఆర్పీ రేటింగ్ తో దూసుకుపోతుంది.
ఇది కూడా చదవండి:
భర్త పైశాచికం: భార్యపై హత్యాయత్నం.. యాసిడ్ తాగించి..
అన్ స్టాపబుల్ గా సాగిపోతున్న ఈ షో మొదటి సీజన్ మరికొన్ని రోజుల్లో ముగియనున్నసంగతి తెలిసిందే. దీంతో.. అప్పుడే అన్ స్టాపబుల్-2 ఎప్పుడు స్టార్ అవుతుంది? దీనికి హోస్ట్ గా ఎవరు వస్తారు? అనే ప్రశ్నలు జోరుగా వినిపిస్తున్నాయి. తాజాగా.. సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్ స్టాపబుల్ షో రిటైర్ బి.వి.యస్ ఈ విషయాలపై క్లారిటీ ఇచ్చారు.
“అన్ స్టాపబుల్ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇంత సక్సెస్ ఫుల్ టాక్ షోకి సెకండ్ సీజన్ ఉండకుండా ఎలా ఉంటుంది? అన్ స్టాపబుల్ సెకండ్ సీజన్ త్వరలోనే స్టార్ట్ అవుతుంది.దానికి కూడా బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తారు. అయితే.., ఇదంతా కూడా నా వ్యక్తిగత నమ్మకం. కానీ.., ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేం కదా? కాబట్టి వేచి చూడాలి” అని బీవీయస్ రవి తెలిపారు.
ఒక సామాన్య రీజనల్ టాక్ షో అయిన.. అన్ స్టాపబుల్ దేశంలోనే టాప్ టాక్ షోగా నిలిచి అందరిని ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. మరి.. ఇంత సక్సెస్ అయిన అన్ స్టాపబుల్ షోకి సెకండ్ సీజన్ కూడా ఉండాలని కోరుకుంటున్నారా? బాలయ్యని మళ్ళీ హోస్ట్ గా చూడాలి అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.