నందమూరి బాలకృష్ణ.. తెలుగునాట ఈ మాటకి పరిచయం అవసరం లేదు. తండ్రి నుండి వచ్చిన లెగసిని నాలుగు దశాబ్దాలుగా పదిలంగా పదింతలు పెంచిన ఘనత బాలయ్య సొంతం. రీల్ లైఫ్ లో మాత్రమే కాదు, రియల్ లైఫ్ కూడా అయన హీరోనే. నలుగురిని కొట్టాలన్నా, పది మందికి పెట్టాలన్న ఆయనకే సాధ్యం. ఇక హీరోగా, ఎమ్మెల్యేగా రెండు పడవల ప్రయాణం చేస్తూనే ఉన్నా.., ఆయన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ని మాత్రం ఎంతో బాధ్యతగా ముందుకి నడిపిస్తున్నారు. ఇక్కడ కొన్ని వేల మందికి బాలయ్య ఉచితంగా వైద్యం అందించిన సందర్భాలు ఉన్నాయి. అయితే.. తాను బతికించిన ఓ చిన్నారి.. చాలా కాలం తరువాత పూర్తి ఆరోగ్యంతో ఆయన ముందుకి రావడంతో.. బాలయ్య కంట ఆనంద బాష్పాలు తన్నుకొచ్చాయి. ఈ మొత్తం అద్భుతమైన ఘటనకి “ఆహ”లోని అన్ స్టాపబుల్ షో వేదిక అయ్యింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
ఆ మధ్య హైదరాబాద్ మల్కాజ్‌గిరి ప్రాంతానికి చెందిన మణిశ్రీ అనే పాప క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ బసవతారకం హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది. ఆమె చికిత్స కోసం రూ.7లక్షలు ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పడంతో తల్లిదండ్రులు దాతల సాయం కోరారు. ఆ విధంగా రూ.1.80లక్షలు పోగయ్యాయి. మిగతా మొత్తాన్ని సర్దుబాటు చేయడం ఆ నిరుపేద దంపతులకు సాధ్యం కాలేదు. ఈ విషయం తెలుసుకున్న బాలయ్య.. ఆ పాప వైద్యానికి మిగతా డబ్బుని సాయంగా అందించారు. ఇంతే కాకుండా.. పాప పూర్తిగా కోరుకునే వరకు మెరుగైన వైద్యం అందించాల్సిందిగా డాక్టర్స్ ని ఆదేశించాడు. అప్పుడు బాలయ్య మంచి మనసు కారణంగా ఆ పాప పూర్తిగా కోలుకుంది. కట్ చేస్తే.. ఇప్పుడు ఆ చిన్నారి బాలకృష్ణ ముందు ప్రత్యక్షం అయ్యింది.
బాలకృష్ణ హోస్ట్ గా మారి.. అన్ స్టాపబుల్ షో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ షోకి గెస్ట్ గా విచ్చేసిన హీరో నాని తనతో పాటు ఆ పాపని వెంటబెట్టుకొని వచ్చి బాలయ్యకి స్వీట్ షాక్ ఇచ్చాడు. ఆ పాపని చూడగానే బాలయ్య ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. ఎప్పుడు సింహంలా గర్జించే బాలయ్య కళ్ళలో ఆనంద బాష్పాలు చూసి అభిమానులు సైతం భావోద్వేగానికి గురవుతున్నారు. మేము బాలకృష్ణ అభిమానులము అని గర్వంగా చెప్పుకోవడానికి ఇంతకన్నా ఏమి కావాలంటూ.. సాక్ష్యంగా ఈ వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మరి.. చూశారు కదా? బాలయ్య మంచి మనసుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.