Unstoppable 2: నందమూరి నట సింహం బాలక్రిష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఓటీటీ టాక్ షో ‘అన్‌స్టాపబుల్’. ఈ షో మొదటి సీజన్ కొన్ని నెలల క్రితమే పూర్తయింది. ఇక, మొదటి సీజన్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. వ్యాఖ్యాతగా బాలయ్య బాబు అదరగొట్టారు. గెస్ట్‌లుగా వచ్చిన వారితో సరదా సరదాగా షో చేసేశారు. ప్రస్తుతం సీజన్ 2 కోసం రంగం సిద్ధమైంది. అతి త్వరలో సీజన్ 2 ప్రారంభం కాబోతోంది. ఇందు కోసం ఏర్పాట్లు కూడా చకాచకా జరిగిపోతున్నాయి. అన్‌స్టాపబుల్ 2 కోసం ఓ ప్రోమో కూడా రెడీ అయిపోయింది. ఈ ప్రోమోకు ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు.
ఈ సాయంత్రం ఆరు గంటలకు ప్రోమో లాంచ్ కానుంది. ఈ నేపథ్యంలో ఆహా టీం ప్రోమో షూటింగ్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలను విడుదల చేసింది. ఆ ఫొటోలను బట్టి చూస్తే.. ప్రోమో హాలీవుడ్ లెవెల్లో ఉండబోతోందని తెలుస్తోంది. ఆ బ్యాక్ గ్రౌండ్ సీన్లు.. బాలయ్య గెటప్ ‘ఇండియానా జోన్స్’ సినిమాను గుర్తు చేసేదిలా ఉన్నాయి. మొదటి సీజన్‌కు సంబంధించిన ప్రోమోకు కూడా ప్రశాంత్ వర్మే దర్శకత్వం వహించారు. ఆ ప్రోమో చాలా పెద్ద హిట్ అయింది. దానికి చాలా అవార్డులు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే సీజన్ 2 ప్రోమోకు కూడా దర్శకత్వం వహించే అవకాశం ప్రశాంత్‌కు వచ్చింది. ప్రస్తుతం సీజన్ 2 ప్రోమో ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కాగా, త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అన్‌స్టాపబుల్ 2 మొదటి ఎపిసోడ్‌కు గెస్ట్‌గా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చారని సమాచారం. ఇప్పటికే మొదటి ఎపిసోడ్ పూర్తయినట్లు తెలుస్తోంది. బావబామరుదులు ఇద్దరూ చాలా ఫన్నీగా ఎపిసోడ్‌ను పూర్తి చేశారంట. జోకులు వేసుకుంటూ సెట్‌లో ఉన్న వారందరినీ ఆశ్చర్యపరిచారంట. ప్రస్తుతం చంద్రబాబు, బాలయ్య కలిసున్న ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఫొటో అన్‌స్టాపబుల్ 2 మొదటి ఎపిసోడ్‌కు సంబంధించిందన్న ప్రచారం జరుగుతోంది.
Can you all see the magic already?
Some BTS stills for you all to feast until the euphoria begins from 6pm.😎🕵♂️🔥#NandamuriBalakrishna#UnstoppableWithNBKS2 pic.twitter.com/K8ZJp3jW79— ahavideoin (@ahavideoIN) October 4, 2022