ఇటీవల ‘హాయ్ నాన్న’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ, గ్లింప్స్ వదలగా సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. బీజీఎమ్ హార్ట్ టచింగ్‌గా ఉంది. ఇదిలా ఉంటే ఈ వీడియోలో నాని కూతురిగా క్యూట్‌గా కనిపించిన పాప ఎవరంటూ నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు.
సినిమా ఇండస్ట్రీలో మెయిన్ లీడ్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులతో పాటు చైల్డ్ ఆర్టిస్టులకు కూడా మంచి పాపులారిటీ ఉంటుంది. ఒకప్పుడు తరుణ్, బాలాదిత్య, తేజ సజ్జా, తనీష్, మనోజ్ నందంతో పాటు ఫీమేల్ చైల్డ్ ఆర్టిస్టులు కొందరు చిన్నప్పుడే తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుని మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ మధ్య కాలంలో అంతలా అలరించిన బాలనటులు, అంతగా గుర్తున్నవారు లేరనే చెప్పాలి. ఇప్పుడో చిన్నారి సెలబ్రిటీ గురించి నెట్టింట ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతుంది. నేచురల్ స్టార్ నాని, ‘సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా.. శౌర్యువ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
మలయాళంలో సంచలన విజయం సాధించిన ‘హృదయం’ మూవీకి మ్యూజిక్ ఇచ్చిన హేషమ్ అబ్దుల్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. శృతి హాసన్ మరో కీలక పాత్రలో కనిపించనుందని అంటున్నారు. నాని నటిస్తున్న 30వ సినిమా ఇది. ఇటీవల ‘హాయ్ నాన్న’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ, గ్లింప్స్ వదలగా సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. బీజీఎమ్ హార్ట్ టచింగ్‌గా ఉంది. ఇదిలా ఉంటే ఈ వీడియోలో నాని కూతురిగా క్యూట్‌గా కనిపించిన పాప ఎవరంటూ నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు.
ఆ బేబి తెలుగులో చేస్తున్న ఫస్ట్ ఫిలిం ఇది. కానీ ఇంతకుముందే బాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకుంది. ఆ పాప పేరు కియారా ఖన్నా. చిన్నప్పుడే పలు ప్రకటనల్లో నటించి అలరించింది. ‘థ్యాంక్ గాడ్’, ‘బందా సింగ్’, ‘బారాముల్లా’, ‘సాంబహదూర్’ వంటి హిందీ చిత్రాల్లో నటించి నార్త్ ఆడియన్స్‌ని ఆకట్టుకుంది. కియారాకు ఇన్‌స్టాగ్రామ్‌లో 3 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అంతేకాదు, Myra & Kiara పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది.