చంద్రమోహన్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఎన్నో సినిమాలో హీరోగా నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. విలక్షణమైన నటుడిగా ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదింకున్నారు. అనేక పాత్రల్లో నటిస్తూ దాదాపు ఐదున్నర దశాబ్దాలులుగా సినీ పరిశ్రమతో మమేకమైన నటుడు చంద్రమోహన్. అయితే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు తమ పిల్లలను ఇండస్ట్రీకి పరిచయం చేయాలని చూస్తారు. ఇక అభిమానులలో మంచి ఫాలోయింగ్ ఉన్న వారి సంగతి చెపనక్కర్లేదు. కానీ చంద్రమోహన్ మాత్రం తన పిల్లలను ఇండస్ట్రీకి దూరంగా పెంచారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చంద్రమోహన్ పిల్లలను చిత్రపరిశ్రమకు పరిచయం చేయకపోవడానికి కారణంతో పాటు, పలు ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నారు.
1966లో రంగులరాట్నం సినిమాతో చంద్రమోహన్ తన సినీ ప్రస్థానం మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 900 పై సినిమాల్లో నటించారు. ఇందులో 175 సినిమాలో హీరోగా నటించారు. అంతేకాదు ఈయనతో హీరోయిన్ గా మొదటి సినిమా చేస్తే తమ కేరీర్ లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు అనే టాక్ కూడా ఉంది. ‘సిరిసిరిమువ్వ’ తో జయప్రద, ‘పదహారేళ్ల వయసు’ సినిమాతో శ్రీదేవి టాప్ హీరోయిన్ లుగా నిలిచిన సంగతి తెలిసిందే. జయసుధ, విజయశాంతి వంటి వారు కూడా చంద్రమోహన్ తో నటించి టాప్ హీరోయిన్ లుగా నిలిచారు. ఇప్పటి తరం హీరోలతో కూడా నటిస్తూ, కెరీర్ లో తనని తాను అప్ డేట్ చేసుకుంటూ అభిమానులను అల్లరిస్తున్నారు. ఇంతలా ఇండస్ట్రీలో గుర్తింపు పొందిన చంద్రమోహన్ తన పిల్లలను మాత్రం సినీ పరిశ్రమకు పరిచయం చేయలేదు.
తన పిల్లల గురించి చంద్రమోహన్ పలు విషయాల చెప్పారు. ఆయన మాట్లాడుతూ..”నాకు ఇద్దరు అమ్మాయిలు. ఇద్దరు చాలా చక్కగా ఉంటారు. చిన్న అమ్మాయి అయితే ఇంకా చాలా బాగుంటుంది. వీళ్లని చిన్నప్పుడు ఒకసారి భానుమాతి గారు చూసి.. పిల్లలు బాగున్నారు చైల్డ్ ఆర్టిస్టులుగా పరిచయం చేద్దాం.. అని అడిగింది. నేను ఆమె మాటను సున్నితంగా తిరస్కరించాను. నాకు పిల్లలతో గడిపే సమయం కూడా ఉండేది కాదు. వాళ్లు లేవక ముందే షూటింగ్ కి వెళ్లే వాడిని. అప్పుడప్పుడు నా భార్య వాళ్లను షూటింగ్ కి తీసుకు వచ్చేది. వాళ్లు నన్ను గుర్తు పట్టే వాళ్లు కాదు.
ఒక్కసారి వీరికి సినిమా రుచి అలవాటు అయితే మళ్లి షూటింగ్ ఎప్పుడు అని అడుగుతారని భయం. వారిపై సినిమా ప్రభావం పడకుండా పెంచాలనుకున్నా. అలాగే ఇద్దరిని పెంచాను. ప్రస్తుతం మా అమ్మాయిలిద్దరు బాగా చదివి గోల్డ మెడల్స్ సాధించారు. మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఇద్దరీకి మంచి సంబంధాలు చూసి పెళ్లి చేయాలి. ఇదే ప్రస్తుతం నాకున్న ఆలోచన” అని చంద్రమోహన్ తెలిపారు. మరి.. చంద్రమోహన్ మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.