రష్యా-ఉక్రెయిన్ సంక్షోభ కారణంగా ఉక్రెయిన్ పరిస్థితులు పూర్తిగా తారుమారయ్యాయి. ప్రజల జీవితం అస్తవ్యస్తమయ్యింది. లక్షలాది మంది ప్రజలు ప్రాణాలు అరచేత పట్టుకుని ఇతర దేశాలకు తరలిపోతున్నారు. అటు రష్యా తగ్గెదేలే అంటే..ఇటు ఉక్రెయిన్ వెనకడుగు వేసే ప్రసక్తే లేదు అంటుంది. కానీ బలవుతుంది మాత్రం ప్రజలే. ఇలాంటి సమయంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన మంచి మనసు చాటుకున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ ఉక్రెయిన్ షూటింగ్ సమయంలో తనకు బాడీ గార్డ్‌గా వ్యవహరించిన వ్యక్తికి ఆర్థిక సాయం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సదరు బాడీగార్డ్ రామ్ చరణ్ తనకు చేసిన మేలు గురించి వివరిస్తూ.. కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇది కూడా చదవండి: రామ్ చరణ్ మంచి మనసు.. ఉక్రెయిన్‌లోని తన సెక్యూరిటీ గార్డుకి ఆర్థిక సాయం!
బాడీ గార్డు పేరు రస్టీ. RRR షూటింగ్ ఉక్రెయిన్‌లో జరుగుతున్న సమయంలో రస్టీ రామ్‌చరణ్‌కు బాడీగార్డ్‌గా ఉన్నాడు. నాడు రస్టీ తనకు చేసిన సేవలు గుర్తుంచుకున్న రామ్ చరణ్ ఆపత్కాలంలో అతడిని ఆదుకున్నారు. ఉక్రెయిన్‌లో సంక్షోభం ప్రారంభమైన వెంటనే రామ్ చరణ్ రస్టీకి కాల్ చేసి.. అతడు, అతని కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారని ఆరా తీశారు. రస్టీ భార్య ఆరోగ్యం బాగాలేదని తెలుసుకున్న రామ్ చరణ్ ఆమెకు అవసరమైన మందులు పంపిచడమే కాక.. తనకు ఆర్థిక సాయం చేశారని రస్టీ తెలిపారు. పూర్తి వివరాల కోసం కింద వీడియో చూడండి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: షాకింగ్: డీజిల్‌పై ఒకేసారి రూ.75 పెంపు.. లీటరు పెట్రోల్ రూ.254
.@AlwaysRamCharan 🙏❤️
— PawanKalyan RamCharan FC (@PawanCharanFC) March 18, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.