తాజాగా ఉగ్రం, రామబాణం మూవీస్ థియేటర్లలోకి వచ్చాయి. ఓ మాదిరి అంచనాలతో ప్రేక్షకుల్ని పలకరించిన ఈ రెండూ.. కలెక్షన్స్ లో మాత్రం డీసెంట్ నంబర్స్ అందుకున్నాయి.
తెలుగులో ప్రతివారం థియేటర్లలోకి కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈసారి అలా అల్లరి నరేష్ ‘ఉగ్రం’, గోపీచంద్ ‘రామబాణం’.. ప్రేక్షకుల్ని పలకరించాయి. రెండూ వేటికవే డిఫరెంట్ జానర్స్. కాబట్టి ఆడియెన్స్ కూడా ట్రైలర్ చూసే ఏ సినిమాకు వెళ్లాలి? దేనికి వెళ్లాల్సిన అవసరం లేదు అనేది ఫిక్స్ అవుతుంటారు. అలా ఈ రెండు మూవీస్ పై ఓ మాదిరిగానే అంచనాలు ఉండేవి. మరి అందుకు తగ్గట్లే తొలిరోజు కలెక్షన్స్ వచ్చాయా లేదా అనేది ఇప్పుడు చూద్దాం. ఇంతకీ ఎవరు పైచేయి సాధించారు?
అసలు విషయానికొస్తే.. అల్లరి నరేష్ కామెడీ హీరోగా ఎంతో పేరు తెచ్చుకున్నాడు. కానీ అదే మూస చిత్రాలు తీసేసరికి సీన్ అర్థమైపోయింది. దీంతో రూట్ మార్చేశాడు. ‘నాంది’ లాంటి సీరియస్ స్టోరీలో హీరోగా నటించి హిట్ కొట్టాడు. ఇప్పుడు అదే టీమ్ చేసిన మరో మూవీ ‘ఉగ్రం’. దీనికి మిక్స్ డ్ రివ్యూస్ వస్తున్నాయి. ఇందులో భాగంగానే ఫస్డ్ డే వరల్డ్ వైడ్ రూ 1.45 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. నరేష్ మూవీ పరంగా చూసుకంటే ఇది మంచి నంబర్లే.
మరోవైపు హీరో గోపీచంద్ మంచి నటుడు. కానీ ఏం లాభం. రొటీన్ స్టోరీలతో ఉండే సినిమాలే చేస్తూ ప్రేక్షకుల్న విసిగిస్తున్నాడు. తనకు రెండు హిట్స్ ఇచ్చిన శ్రీవాస్ తో ‘రామబాణం’ చేశాడు కానీ అది బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేసింది. అయితే తొలిరోజు టికెట్స్ బాగానే తెగినట్లున్నాయి. అందుకే వరల్డ్ వైడ్ ఫస్డ్ కలెక్షన్స్ రూ 2.45 కోట్లు వచ్చాయని తెలుస్తోంది. ఇది బాగానే ఉన్నప్పటికీ వీకెండ్ గడిచేటప్పటికీ ఇది బాగా తగ్గిపోవచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే తొలి రోజు వసూళ్లలో ‘రామబాణం’ టాప్ లో ఉన్నప్పటికీ లాంగ్ రన్ లో మాత్రం ‘ఉగ్రం’ పైచేయి సాధించొచ్చని తెలుస్తోంది. మరి ఈ రెండింటిలో ఏ మూవీ బాగుందో కింద కామెంట్ చేయండి.