ఈ మద్య కాలంలో పలు సినీ ఇండస్ట్రీల్లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తమకు ఎంతగానో ఇష్టమైన నటీనటులు కన్నుమూయడంతో అభిమానులు శోక సంద్రంలో మునిగిపోతున్నారు.
సినీ ఇండస్ట్రీలో గత కొంత కాలంగా వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ప్రముఖ నటీనటులు, దర్శక, నిర్మాతలు వరుసగా కన్నుమూస్తున్నారు. గత నెలలో ఆర్ఆర్ఆర్ నటుడు రే స్టీవెన్‌సన్, టాలీవుడ్ ప్రముఖ నటుడు శరత్ బాబు, బాలీవుడ్ నటి వైభవి, నటుడు నితీష్ పాండే ఇలా వరుసగా కన్నుమూయడంతో అభిమానులో శోకసంద్రంలో మునిగిపోయారు. తాజాగా రెండు సార్లు ఆస్కార్ అవార్డు గెల్చుకున్న ప్రముఖ నటి కన్నుమూశారు. వివరాల్లోకి వెళితే..
ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆస్కార్ విజేత బ్రిటిష్ నటి గ్లెండా జాక్సన్ (87) గురువారం తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా గ్లెండా జాక్సన్ అనారోగ్యంతో బాధపడుతూ తన ఇంట్లో మరణించారని ఆమె ఏజెంట్ లియోనెల్ లార్నర్ తెలిపారు. గ్లెండా జాక్సన్ ఆ మద్యనే ‘ది గ్రేట్ ఎస్కేపర్’ మూవీ షూటింగ్ లో పాల్గొన్నారు. ఈ మూవీలో ఆమె మైఖేల్ కెయిన్ తో కలిసి నటించారు. 1970 లో వచ్చిన ‘విమెన్ ఇన్ లవ్’ మూవీ ఆమెకు ఎంతో గొప్ప పేరు తీసుకు వచ్చింది.. అంతేకాదు ఆస్కార్ అవార్డు కూడా కైవసం చేసుకుంది. దశాబ్దాల క్రితమే ఉత్తమ నటిగా గ్లెండా జాక్సన్ రెండు ఆస్కార్‌లు కైవసం చేసుకున్నారు.
రాజకీయాల్లోకి ప్రవేశించారు నటి గ్లెండా జాక్సన్. లేబర్ పార్టీ సభ్యురాలిగా పార్లమెంట్ కి ఎన్నికై దాదాపు 23 సంవత్సరాల పాటు రాజకీయాల్లో కొనసాగింది. పార్లమెంట్ సభ్యత్వం ముగిసిన తర్వాత తిరిగి నటనపై దృష్టి పెటారు గ్లెండా జాక్సన్. షేక్ స్పీయర్ ‘కింగ్ లియర్’ మూవీలో టైటిల్ రోల్ తో సహా పలు పాత్రల్లో నటించి గొప్ప పేరు సంపాదించింది గ్లెండా జాక్సన్. ఆమె కెరీర్ లో ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్నారు. రెండు ఆస్కార్ అవార్డులు, ట్రిపుల్ క్రౌన్ ఆఫ్ యాక్టింగ్ గ్రహీత, మూడు ఎమ్మీ అవార్డులు, టోనీ అవార్డు లు ఆమెకు దక్కాయి. 1970 లో ‘ఉమెన్ ఇన్ లవ్’ ఉత్తమ నటిగా తొలిసారి ఆస్కార్ అందుకోగా.. 1973 ‘ఎ టచ్ ఆఫ్ క్లాస్’ మూవీతో మరో అవార్డు దక్కించుకుంది.
గ్లెండా జాక్సన్ కెరీర సక్సెస్ ఫుల్ గా సాగుతున్న సమయంలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి నటనకు విరామం ప్రకటించారు. 1992 లో తొలిసారిగా బ్రిటీష్ పార్లమెంట్ కి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1997 లో టోనీ బ్లెయిర్ ఆధ్వర్యంలో రవాణా శాఖ కార్యదర్శిగా కొనసాగారు. 1958 లో సహనటుడు రాయ్ హెడ్జెస్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. 1976 లో వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి ఆమె ఒంటరిగానే జీవిస్తుంది. నటి గ్లెండా జాక్సన్ మరణంపై ప్రముఖ నటులు, రాజకీయ నేతలు నివాళులర్పించారు.