2005లో ఆర్యన్ రాజేష్ హీరోగా వచ్చిన ఎవడి గోల వాడిదే సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన గీతా సింగ్.. 2006లో అల్లరి నరేష్ హీరోగా వచ్చిన కితకితలు సినిమాలో హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాతో తన నటనతో అందరినీ కడుపుబ్బా నవ్వించారు. కితకితలు సినిమాతో గీతా సింగ్ ఒక్కసారిగా స్టార్ డమ్ తెచ్చుకుంది. అసలు లావుగా ఉన్నా కూడా హీరోయిన్ గా చేయచ్చు, ఆడియన్స్ ని కన్విన్స్ చేయవచ్చు అని నిరూపించిన నటి గీతా సింగ్. కితకితలు సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న గీతా సింగ్.. ఆ ఆ తర్వాత ప్రేమాభిషేకం, సీమ టపాకాయ్, కెవ్వు కేక, సరైనోడు వంటి హిట్ సినిమాల్లో నటించింది. ఫిమేల్ కమెడియన్ గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గీతా సింగ్ ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురుచూస్తుంది.
ఈ క్రమంలో సుమన్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఆమె జీవితంలో జరిగిన హ్యాపీ మూమెంట్స్ ని అలానే బాధాకరమైన సంఘటనలను పంచుకున్నారు. ఏ క్రమంలో ఓ సందర్భంలో తనను ఇద్దరు హీరోయిన్లు అవమానించారని, ఆ సమయంలో అల్లరి నరేష్ తన పరువు నిలబెట్టారని గుర్తు చేసుకున్నారు. అల్లరి నరేష్ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన గీతా సింగ్.. ఆ సినిమా షూటింగ్ లో తనని ఇద్దరు హీరోయిన్లు అవమానించారని ఆమె వెల్లడించారు. షూటింగ్ జరుగుతుండగా గ్యాప్ సమయంలో క్యారవాన్ ఎక్కానని, అయితే ఆ క్యారవాన్ లో బాంబే హీరోయిన్స్ ఉన్నారని ఆమె అన్నారు.
‘ఏంటి ఈమె క్యారవాన్ ఎక్కింది, జూనియర్ ఆర్టిస్ట్’ అంటూ కించపరిచారట. అప్పుడు మిగతా నటులు.. గీతా సింగ్ తో.. ఏంటి నిన్ను ఇలా అంటున్నారు’ అని అన్నారట. దానికి గీతా సింగ్.. వాళ్లకి తెలియక అలా అన్నారులే, ఇప్పుడేమైంది’ అంటూ క్యారవాన్ దిగి లొకేషన్ లో ఒక పక్కన కూర్చున్నారట. ఈ విషయం తెలుసుకున్న అల్లరి నరేష్.. గీతా సింగ్ ని బాంబే హీరోయిన్స్ దగ్గరకు తీసుకెళ్లి.. ఈమె నా ఫస్ట్ హీరోయిన్.. తన నుంచి నాకు బ్రేక్ వచ్చింది’ అని చెప్పారట. దీంతో ఆ హీరోయిన్లు కంగుతిన్నారట. ఇక ఆ తర్వాత నుంచి గీతా సింగ్ ని మేడమ్ అని పిలవడం ప్రారంభించారట.
నరేష్ కి అసలు తన గురించి బాంబే హీరోయిన్స్ దగ్గర చెప్పాల్సిన అవసరం లేకపోయినా.. చెప్పారని, అదే నరేష్ కి ఉన్న గొప్ప లక్షణం అని అన్నారు. ఇక ప్రస్తుతం తనకి అవకాశాలు లేవని, దర్శక, నిర్మాతలు అవకాశాలు ఇవ్వాలని కోరుకున్నారు. ఇంకా ఆమె జీవితంలో ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు. రెండు సార్లు చనిపోవాలనుకున్నానని, కుటుంబ సభ్యులే తనను మోసం చేసారని, లేడీ కమెడియన్స్ కి అవకాశాలు రావడం లేదని ఆమె తన బాధలను చెప్పుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో కింద ఉంది. చూడగలరు.