దెయ్యాలు, ఆత్మలు ఉన్నాయా లేవా అనే అంశంపై ఇంకా ప్రపంచవ్యాప్తంగా చర్చ సాగుతూనే ఉంది. కొందరు దెయ్యాలున్నాయని వాదిస్తుంటే.. మరికొందరు దెయ్యాలు లేవని వాదిస్తుంటారు. దెయ్యం అనేది ఓ మూఢ నమ్మకమని అనే వారు కూడా ఉంటారు. దైవాన్ని నమ్మని నాస్తికులైతే.. తాము దెయ్యాలను కూడా నమ్మే ప్రసక్తి లేదంటారు. ఆధ్యాత్మిక వేత్తలైతే దేవుడిని నమ్మేవారు దెయ్యాలను కూడా నమ్మాలని చెబుతుంటారు. ఏది ఏమైనా ఎవరి నమ్మకం వారిది అని మరికొందరు అంటారు. ఇక దెయ్యాలు, క్షుద్రశక్తులకు సంబంధించిన సినిమాలు ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి..
ప్రముఖ బాలీవుడ్ నటి, సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా ఆసక్తికర అంశం వెల్లడించారు. ఇటీవల ఆమె తన యూట్యూబ్ చానల్ కోసం జైపూర్ రాజవంశీకురాలు రాజమాత పద్మినీ దేవితో ముచ్చటించారు. ఈ సందర్భంగా తన తల్లి డింపుల్ కపాడియా గురించి ఆసక్తికర విషయం ప్రస్తావించారు. ఒకప్పుడు తన తల్లి జైపూర్ రాయల్ ప్యాలెస్ లో ఒక షూటింగ్ కోసం వెళ్లారట.. అక్కడ ఆమెకు ఒక దెయ్యం కనిపించడంతో హడలిపోయారని ట్వింకిల్ ఖన్నా తెలిపింది. ఆ తర్వాత తన తల్లి దెయ్యంతో ముచ్చట్లు కూడా పెట్టినట్లు ఆమె తెలిపింది.
బాలీవుడ్ లో హర్రర్ మూవీగా తెరకెక్కిన ‘లేకిన్’ మంచి విజయం సాధించింది. ఈ చిత్రం షూటింగ్ నిమిత్తం ట్వింకిల్ ఖన్నా తల్లి డింపుల్ కపాడియా ఒక రాత్రి ప్యాలెస్ లో ఉండాల్సి వచ్చిందట. ఆ సమయంలో తన తల్లి పడుకున్న చోటికి ఓ మహిళ వచ్చి ఏదో మాట్లాడుతున్నట్లు అనిపించిందట.. వెంటనే లేచి చూస్తే అది దెయ్యం అని గుర్తించిందట.. కానీ ఆ దెయ్యం ఏమీ చేయకుండా కొద్ది సేపు ముచ్చటించి వెళ్లిందట. ఈ విషయాన్ని అప్పట్లో తన తల్లి తనతో చెప్పిందని ట్వింకిల్ ఖన్నా తెలిపింది.
ఇది కూడా చదవండి: Kurnool: కర్నూలు జిల్లాలోని ఆ ప్రాంతంలో పాలు ఉచితంగా ఇస్తారు, అమ్మరు!
ఇటీవల ట్వింకిల్ ఖన్నా తన యూట్యూబ్ ఛానల్ కోసం రాజమాతను ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా రాజమాత మాట్లాడుతూ.. జైపూర్ ప్యాలెస్ కి ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నాయని.. ఇక్కడ ఏ దెయ్యం, భూతం లేదని అన్నారు. ఇక లేకిన్ మూవీలో డింపుల్ కపాడియా ఒక దెయ్యం పాత్రలో నటించింది.. ఆ మూవీ ప్రభావం అప్పుడు ఆమెపై పడి ఉండొచ్చని అన్నారు. ఆ సమయంలో ఆమె మానసికంగా ఎలాంటి పరిస్థితిలో ఉందో తెలియదని.. అందుకే ఏదో ఊహించుకొని దెయ్యం అనే భావనలో ఉన్నారని తెలిపారు. ఈ విషయం గురించి అప్పట్లో డింపుల్ కపాడియాతో మాట్లాడానని రాజమాత పద్మినీ దేవి తెలిపారు.
1990 లో హర్రర్ మూవీగా తెరకెక్కిన ‘లేకిన్’ మంచి విజయం సాధించింది. ఈ మూవీలో డింపుల్ కపాడియా.. రేవా అనే ఒక దెయ్యం పాత్రలో కనిపిస్తుంది. ఈ చిత్రంలో వినోద్ ఖన్నా హీరోగా నటించారు. ఇక లేకిన్ లో డింపుల్ కపాడియా నటనకు ఫిలిం ఫేర్ అవార్డు కూడా దక్కింది. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.