తెలుగు సినీ పరిశ్రమ దిగ్గజం.. సవాళ్లకు ఎదురెళ్లి ఢీకొనే నైజం.. మూస ధోరణికి చరమగీతం పాడే ఆలోచనలు ఆయన సొంతం.. ఆయనే ఘట్టమనేని కృష్ణ. కౌబాయ్ గా, గూఢాచారిగా, అల్లూరిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అప్పటి వరకు మూస ధోరణిలో సాగుతున్న తెలుగు సినీ పరిశ్రమను కొత్త పుంతలు తొక్కించి.. ప్రపంచానికి చాటి చెప్పిన సూపర్ స్టార్ కృష్ణ ఇక లేరు. గుండె నొప్పితో ఆదివారం అర్ధరాత్రి ఆస్పత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారు జామున తుది శ్వాస విడిచారు. దాంతో కుటుంబ సభ్యులతో పాటు యావత్ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి చెందింది. దాంతో కృష్ణ కుటుంబ సభ్యులకు సినీ, రాజకీయ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపం తెలుపుతున్నారు.
“ఇది మాటలకు అందని విషాదం. సూపర్ స్టార్ కృష్ణ గారు మనల్ని వదిలి వెళ్లిపోవడం నమ్మశక్యంగా లేదు. ఆయన జాలి, దయ లో ఓ హిమాలయ పర్వతం. ఇక సాహసానికి ఊపిరి, ధైర్యం, పట్టుదలకు మారు పేరు. అలాంటి వ్యక్తి నేడు మన మధ్య లేరంటే నమ్మలేకపోతున్నాను. తెలుగు సినీ పరిశ్రమ తలెత్తుకోగల సినిమాలు తీసి.. సాహసాలు చేసిన సూపర్ స్టార్ కృష్ణ గారికి అశ్రు నివాళి” అంటూ మెగస్టార్ చిరంజీవి భావోద్వేగంతో కూడిన ట్వీట్ చేశారు. ప్రముఖ నిర్మాత అయిన ఎమ్మెస్ రాజు “నేను ఈ విషయాన్ని అస్సలు నమ్మలేక పోతున్నాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి” అంటూ ట్వీట్ చేశారు.
— Chiranjeevi Konidela (@KChiruTweets) November 15, 2022
“విలక్షణమైన పాత్రలే కాకుండా, ప్రయోగాత్మక చిత్రాలు, సాహసాలు చేసిన సూపర్ స్టార్ కృష్ణ గారు మన మధ్య లేరన్న విషయం బాధాకరం. సాంకేతికతను తెలుగు సినిమాకి పరిచయం చేసిన మీ ఘనత చిరస్మరణీయం. మహేశన్నా మీ కుటుంబానికి నా ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నాను” అంటూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. మా మూవీ అసోషియేషన్ అధ్యక్షుడు హీరో మంచు విష్టు ” ఈ వార్తతో నా గుండె బద్దలైంది” అంటూ హార్ట్ బ్రోకెన్ సింబల్ తోపాటు తన సూపర్ స్టార్ కృష్ణ పిక్ ను జత చేశాడు. సూపర్ స్టార్ అభిమానులతో పాటుగా మహేశ్ బాబు అభిమానులు ట్వీటర్ వేదికగా ‘స్టే స్ట్రాంగ్ మహేశన్నా’ హ్యాష్ ట్యాగ్ లో కామెంట్స్ పెడుతున్నారు. మరికొంత మంది సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు సూపర్ స్టార్ కృష్ణ కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారు.
శ్రీ కృష్ణ గారు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలి – JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/MuLsGyrzbO
— JanaSena Party (@JanaSenaParty) November 15, 2022
కృష్ణ గారు అంటే సాహసానికి మరో పేరు. ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు, విలక్షణమైన పాత్రలే కాకుండా, సాంకేతికంగా కూడా తెలుగు సినిమాకు ఎన్నో విధానాలు పరిచయం చేసిన మీ ఘనత ఎప్పటికి చిరస్మరణీయం.
My thoughts are with Mahesh Anna and the family.
Om Shanthi. Superstar forever.
— Jr NTR (@tarak9999) November 15, 2022