బుల్లితెరపై బెస్ట్ పెయిర్ అనిపించుకున్న సెలబ్రిటీలలో సుడిగాలి సుధీర్ – యాంకర్ రష్మీల జంట ఒకటి. సినీ స్టార్స్ తో సమానంగా సుధీర్ – రష్మీ పెయిర్ కి క్రేజ్ ఉంది. వీరిద్దరూ ఏ షోలో కనిపించినా.. ఆ షో టిఆర్పీ రేటింగ్స్ అలా దూసుకుపోతాయి. ఎన్నో ఏళ్లుగా వీరిద్దరి పెయిర్, కెమిస్ట్రీని జనాలు ఆదరిస్తూ, ఎంజాయ్ చేస్తున్నారు. అలాంటిది కొంతకాలంగా సుధీర్ జబర్దస్త్ తో పాటు బుల్లితెర ప్రోగ్రామ్స్ అన్నీ వదిలేసి సినిమాలవైపు వెళ్ళిపోయాడు. సినిమాల కోసమే వెళ్లాడా లేక అతని పర్సనల్ కారణాలు ఏమైనా ఉన్నాయో తెలియదు. కానీ.. బుల్లితెర ప్రేక్షకులు మాత్రం సుధీర్ కంబ్యాక్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇటీవలే గాలోడు సినిమాతో హీరోగా మంచి విజయాన్ని అందుకున్నాడు సుధీర్. దీంతో తదుపరి సినిమాలను కూడా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడట. ఇదివరకు జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ షోస్ లో సందడి చేసేవాడు. కానీ.. సినీ కెరీర్ కోసం ఈ టీవీ షోస్ అన్నింటికీ గుడ్ బై చెప్పేశాడని అంతా అనుకున్నారు. ఈ విషయంపై సుధీర్ ఇప్పటివరకు స్ట్రాంగ్ రీసన్ అయితే చెప్పలేదు. ఆ మధ్యలో ఈటీవీని వదిలేసి, స్టార్ మాలో ఓ ప్రోగ్రాం చేశాడు. కొద్దిరోజులకు అదికూడా అటకెక్కడంతో.. టీవీ షోలవైపు వెళ్లకుండా గాలోడు సినిమా ఒక్కటి చేసి ఊరుకున్నాడు. దీంతో కనీసం టీవీ షోస్ లోనైనా రీఎంట్రీ ఇస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేశారు.
ఎట్టకేలకు త్వరలోనే ఫ్యాన్స్ కోరిక ఫలించబోతున్నట్లు తెలుస్తోంది. సుధీర్ మళ్లీ టీవీ ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నాడట. మరి ఏ షో ద్వారా రాబోతున్నాడు? అనంటే.. త్వరలో ప్రారంభం కాబోతున్న డాన్స్ రియాలిటీ షో ‘ఢీ 15’లో ఎంట్రీ ఇవ్వనున్నాడని టాక్. దాదాపు 14 సీజన్ల నుండి విజయవంతంగా ప్రేక్షకులకు ఆకట్టుకుంటున్న ఈ షోలో.. ఇదివరకే సుధీర్ – రష్మీ పెయిర్ సందడి చేశారు. ఏమైందో గానీ సడన్ గా ఇద్దరు వెళ్లిపోయారు. ఇక వచ్చే ఆదివారం నుండి ఢీ 15.. కొరియోగ్రాఫర్ ప్రభుదేవా చేతుల మీదుగా లాంచ్ అవ్వబోతుంది. ఈ క్రమంలో ఢీ నిర్వాహకులు సుధీర్ ని మళ్లీ ఒప్పించినట్లు తెలుస్తోంది. సుధీర్ తో పాటు యాంకర్ రష్మీ కూడా ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం. ఈ విషయం తెలిసి సుధీర్ – రష్మీ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తుండగా.. ఆ తర్వాత మెల్లగా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలోకి కూడా సుధీర్ రావొచ్చని అంటున్నారు. మరి ఈ విషయంపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.