తెలుగు బుల్లితెరపై అలరిస్తున్న సింగింగ్ ప్రోగ్రాంలలో ‘సరిగమప ది సింగింగ్ సూపర్ స్టార్’ ఒకటి. ఈ కార్యక్రమం మొదలైన తక్కువ కాలంలోనే ప్రేక్షకులలో మంచి క్రేజ్ క్రియేట్ చేసుకుంది. ప్రతి ఎపిసోడ్ లో ఊహించని ట్విస్టులు, మంచి వినసొంపైన పెర్ఫార్మన్సుల ద్వారా ఈ ప్రోగ్రాం ప్రేక్షకులకు దగ్గరైంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ సింగింగ్ రియాలిటీ షో ఇప్పుడు తుదిదశకు చేరుకుంది. ఇరవై నాలుగు మంది కంటెస్టెంట్స్ లో ఎనిమిది మంది ఫినాలేకు వెళ్లారు.
ఇక ఆ ఎనిమిది మంది సింగర్స్ ఎవరంటే.. అభినవ్, డానియెల్, సాయిశ్రీ చరణ్, సుధాన్షు, శివాని, దాసరి పార్వతి, శృతిక సముద్రాల సహా ప్రణవ్ కౌశిక్ ఫినాలేలో పోటీ పడనున్నారు. ఆగష్టు 14న (ఆదివారం) ఉదయం 11 గంటలకు మొదలయ్యే ఫినాలే ఎపిసోడ్ లో సరిగమప టైటిల్ కోసం పలు రౌండ్స్ జరగనున్నాయి. ఫినాలేలో సింగర్స్ అద్భుతమైన పాటలకు తోడు ప్రముఖ గాయని పీ.సుశీల, మాచర్ల నియోజకవర్గం స్టార్స్ నితిన్, క్రితి శెట్టి, అలాగే శృతి హాసన్ అతిధులుగా రానున్నారు.
భారతీయ సంగీత ప్రపంచానికి పి.సుశీల చేసిన సేవలకు గాను ‘జీ తెలుగు’ ఆమెను ఘనంగా సన్మానించనున్నారు. శృతి హాసన్, నితిన్ అలాగే క్రితి శెట్టి డ్యాన్స్ లతో సందడి చేయనున్నారు. వీరితో పాటు మెగా డాటర్ నిహారిక కొణిదెల, యూట్యూబర్స్ అనిల్ జీల, నిఖిల్ విజయేంద్ర సింహ తదితరులు కూడా ఈ ఫినాలేలో కనిపించనున్నారు. ఈ ‘సరిగమప ది సింగింగ్ సూపర్ స్టార్’ టైటిల్ ఎనిమిది మందిలో ఎవరు చేజిక్కించుకుంటారనే ఆసక్తి ఫినాలే ప్రోమో చూసినవారందరిలో మొదలైంది.
ఇక ఫినాలే ప్రోమోలో ఎంత హంగామా కనిపించినా ప్రేక్షకుల ఆసక్తిని తప్పించలేవు. ఏ సింగర్ టైటిల్ గెలుస్తారనే విషయంలో నెటిజన్స్ పలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. జనరల్ గా ప్రోగ్రాం చూసేవారికి పర్సనల్ గా ఒక సింగర్ పై అభిమానం ఏర్పడుతుంది. అలాగని అభిమానించేవారే గెలుస్తారనే గ్యారంటీ లేదు. కానీ.. తాము అభిమానించేవారు గెలవాలని మాత్రం అందరూ కోరుకుంటారు. ఈ క్రమంలో టైటిల్ ఎవరు విన్ అవుతారనే రేసులో ముఖ్యంగా డేనియల్, అభినవ్, దాసరి పార్వతిల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయని సమాచారం. మరి అంచనాలు ఏవైనా చివరికి గెలిచేది ఒక్కరే. కాబట్టి.. మీ అభిప్రాయాలను, మీ ఫేవరేట్ సింగర్ లను కామెంట్స్ లో తెలియజేయండి.